చిక్కుల్లో యూనివర్సల్ హీరో కమల్ హాసన్.. లోక నాయకుడికి తప్పని తిప్పలు..

kamal haasan | విలక్షణ భారతీయ నటుడు, దర్శకుడు,నిర్మాత, మరియు రాజకీయ నాయకుడుగా బహుముఖ ప్రజ్క్ష ప్రదర్శిస్తున్న కమల్ హాసన్ చిక్కుల్లో ఇరుక్కున్నాడు.

news18-telugu
Updated: September 27, 2019, 9:15 AM IST
చిక్కుల్లో యూనివర్సల్ హీరో కమల్ హాసన్.. లోక నాయకుడికి తప్పని తిప్పలు..
కమల్ హాసన్ (twitter/Photo)
  • Share this:
విలక్షణ భారతీయ నటుడు, దర్శకుడు,నిర్మాత, మరియు రాజకీయ నాయకుడుగా బహుముఖ ప్రజ్క్ష ప్రదర్శిస్తున్న కమల్ హాసన్ చిక్కుల్లో ఇరుక్కున్నాడు. ఆయనపై ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. కమల్ హాసన్ ఒక సినిమా కోసం తన నుండి రూ.10 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారన్నరని ఆయన ఆరోపించారు. ఇప్పటి వరకు సినిమా చేయలేదు. ఈ విషయమై కమల్ హాసన్‌ను  డబ్బు తిరిగి చెల్లించమని అడిగితే.. ఆయన నుండి ఎలాంటి స్పందన లేదన్నారు. ఈ సందర్భంగా జ్ఞానవేల్ రాజా కమల్ హాసన్ పై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసారు. ‘ఉత్తమ విలన్’ సినిమా సమయంలో కమల్ హాసన్.. జ్ఞానవేల్ రాజా నుండి ఈ డబ్బులు తీసుకున్నట్టు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మరి జ్ఞానవేల్ రాజా ఫిర్యాదుతో నిర్మాత మండలి కమల్ హాసన్ పై ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనేది చూడాలి. ప్రస్తుతం కమల్ హాసన్, బిగ్‌బాస్3 తమిళ రియాల్టీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు శంకర్ దర్శకత్వంలో ‘భారతీయుడు 2’ సినిమా చేస్తున్నాడు.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 27, 2019, 9:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading