Prakash Raj: ప్రస్తుతం తెలుగు సిని ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పోటీ జరగనున్నట్లు తెగ వార్తలు వినిపిస్తున్నాయి. అందులో పలువురు నటులు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ 'మా' అధ్యక్ష పదవి కోసం పోటీ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల గురించి టాలీవుడ్ లో బాగా హాట్ టాపిక్ గా మారింది. జోరుగా ప్రచారాలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది.
ఇక ఇటీవలే నటుడు ప్రకాష్ రాజ్ పోటీ గురించి కరాటే కళ్యాణి కొన్ని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు ఓటు వేసే ప్రసక్తే లేదని తన మనసులో మాటలను బయటపెట్టింది. ఇక ఈయనకు మెగా ఫ్యామిలీ నుండి మద్దతు ఉందని వార్తలు కూడా వినిపించాయి. అంతేకాకుండా మంచు విష్ణు కు మెగా ఫ్యామిలీ నుండి మద్దతు ఉందని తెలియగా ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుండి ఎక్కడ మద్దతు అందుతుందో అని తెగ ఆరాటపడుతున్నారు.
ఇక ఈ విషయం గురించి ప్రకాష్ రాజ్ కొన్ని ఓపెన్ కామెంట్స్ చేశాడు. కళాకారులు ఒక ప్రాంతానికే పరిమితం కాదని, యాక్టర్లు యూనివర్సల్ అనే విషయాన్ని తెలుసుకోవాలని తెలిపాడు. అంతేకాకుండా ఆ ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ అనే విషయాలను తెరపైకి లాగొద్దని తెలిపాడు. ఇండస్ట్రీలో అందరూ అందరికీ కావలసిన వారేనని.. ఇక తాను పదవి కోసం పోటీ చేయడం లేదని తెలిపాడు. అంతేకాకుండా ఈ విషయంలో చిరంజీవిని ఎందుకు లాగుతున్నారో తనకు అర్థం కావడం లేదని వ్యక్తం చేశాడు.
ఇక రాజకీయ పరంగా తనకు నాగబాబుతో విరోధం ఉందని.. కానీ ఇండస్ట్రీ పరంగా తామంతా ఒక్కటేనని తెలిపాడు. ఇక మంచు విష్ణు కూడా ఫోన్ చేసి ఎన్నికలను అసహ్యంగా మారకుండా చూద్దామని చెప్పానని తెలిపాడు. అంతేకాకుండా తమ ప్యానల్ లో నలుగురు అధ్యక్షులుగా ఉన్నారట. ఒకవేళ తాను తప్పు చేస్తే బయటకు పంపించే గట్టి వాళ్ళు ఉన్నారని తెలిపాడు. ఇక ఈ ఎన్నికలలో అందరూ ఆశ్చర్యపోయేలా పని చేస్తామని తెల్లపాడు ప్రకాష్ రాజ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Actor prakash raj, Actress hema, Jivitha rajashekar, Manchu Vishnu, Megastar Chiranjeevi, Tollywood