విజయ నిర్మల మృతికి సంతాపం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి..

ప్రముఖ నటి, దర్శకురాలు..సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయ నిర్మల (73) ఈ రోజు ఉదయం కన్నుమూసారు. గత కొంత కాలంగా అస్వస్థతతో బాధ పడుతున్న ఆమె హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆమె మృతికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేసారు. 

news18-telugu
Updated: June 27, 2019, 10:39 AM IST
విజయ నిర్మల మృతికి సంతాపం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి..
విజయనిర్మల (ట్విట్టర్ ఫోటో)
  • Share this:
ప్రముఖ నటి, దర్శకురాలు..సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయ నిర్మల (73) ఈ రోజు ఉదయం కన్నుమూసారు. గత కొంత కాలంగా అస్వస్థతతో బాధ పడుతున్న ఆమె హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆమె మృతికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేసారు.  ప్రపంచంలోనే  అత్యధిక చిత్రాలను డైరెక్ట్ చేసిన మహిళ గిన్నిస్ బుక్‌తో పాటు అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. అంతేకాదు నటిగా, దర్శకురాలిగా తెలుగు సిని కళామతల్లికి విశిష్ట సేవలందించారని ఈ సందర్భంగా కొనియాడారు. మహిళలు అన్నీ రంగాల్లో రాణించగలరని,అద్భుతమైన ప్రతిభ చూపగలరని ఆమె ఆరోజుల్లోనే నిరూపించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.


ఇక విజయ నిర్మల పార్థివ దేహాన్ని మరికాసేట్లో నానక్ రామ్ గూడా లోని ఆమె స్వగృహానికి తీసుకు వస్తారు. ఈ రోజు అంతా అక్కడివుంచి రేపు ఉదయం ఫిల్మ్ ఛాంబర్‌లో కాసేపు ఉంచిన తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలియజేసారు. .
Published by: Kiran Kumar Thanjavur
First published: June 27, 2019, 10:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading