RRR Climax: ‘RRR’లో క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్.. రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు అవి ఉండవంట..!

ఆర్ఆర్ఆర్ సినిమా (RRR movie)

RRR Climax: తెలుగు ప్రేక్షకుల మనసు మారిపోయింది. వాళ్ల అభిరుచి కూడా మారిపోతుంది. ఒకప్పట్లా హీరోలు బతికితేనే సినిమా చూస్తాం.. చచ్చిపోతే చూడం అనే పరిస్థితుల్లో ఇప్పుడు ఆడియన్స్ లేరు. వాళ్లకు మంచి కథ చెప్తే చాలు..

  • Share this:
తెలుగు ప్రేక్షకుల మనసు మారిపోయింది. వాళ్ల అభిరుచి కూడా మారిపోతుంది. ఒకప్పట్లా హీరోలు బతికితేనే సినిమా చూస్తాం.. చచ్చిపోతే చూడం అనే పరిస్థితుల్లో ఇప్పుడు ఆడియన్స్ లేరు. వాళ్లకు మంచి కథ చెప్తే చాలు.. అందులో హీరో పాత్రలా ఉంటే సరిపోతుంది. చివర్లో హీరోకు నెగిటివ్ ఎండింగ్ ఇచ్చినా కూడా అర్థం చేసుకునే పరిస్థితికి వచ్చారు ఆడియన్స్. కలర్ ఫోటోలో హీరో చనిపోతాడు అయినా ఆదరించారు. మొన్న విడుదలైన ఉప్పెన సినిమా క్లైమాక్స్ కూడా నెగిటివ్‌గానే ఉంటుంది. ఈ సినిమా 100 కోట్ల క్లబ్బులో చేరిపోయింది. అలా హీరోలు చనిపోయినా.. అంగవైకల్యంతో ఉన్నా కూడా ఆదరిస్తున్నారు. కథ బాగుంటే చాలంటున్నారు. ఈ నమ్మకంతోనే ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి కూడా తన సినిమాలో అలాంటి ఎండింగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈయన ట్రిపుల్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు ఇందులో నటిస్తున్నారు. కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోనే క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతుంది. ఈ సినిమా క్లైమాక్స్ ఊహించని విధంగా ఉంటుందని తెలుస్తుంది. ట్రాజిక్ క్లైమాక్స్ ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. అంటే హీరోలిద్దర్నీ చంపేస్తున్నాడా ఏంటి అనుకుంటున్నారా..? అలాంటిదేం లేదు.. చచ్చిపోరు కానీ ట్రాజికల్ ఎండింగ్ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. తన సినిమాల్లో హీరో చనిపోయినా కూడా చాలా ఎమోషనల్‌గా చూపిస్తుంటాడు రాజమౌళి.
rrr,rrr movie,rrr movie climax,rrr movie negative climax,rrr movie tragic ending rajamouli,rajamouli rrr climax,rajamouli ram charan jr ntr,ram charan jr ntr rrr movie,telugu cinema,ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్,RRR క్లైమాక్స్‌లో నెగిటివ్ ఎండింగ్,రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్,నెగిటివ్ క్లైమాక్స్ ఆర్ఆర్ఆర్
ట్రిపుల్ ఆర్ క్లైమాక్స్ (RRR climax shoot)

విక్రమార్కుడు, బాహుబలి, మగధీర లాంటి సినిమాలలో హీరోను చంపేసినా కూడా చాలా ఎమోషనల్‌గా చూపించాడు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమా విషయంలోనూ ఇదే చేయబోతున్నాడు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. కొమురం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ ఇద్దరూ కూడా బ్రిటీష్ వాళ్లతో పోరాటంలో భాగంగా ఆ ఇద్దరూ వైకల్యం పొందుతారని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పాత్రకు కళ్లు పోతే.. రామ్ చరణ్ పాత్ర కాళ్లు కోల్పోతుందని వార్తలు వస్తున్నాయి.
rrr,rrr movie,rrr movie climax,rrr movie negative climax,rrr movie tragic ending rajamouli,rajamouli rrr climax,rajamouli ram charan jr ntr,ram charan jr ntr rrr movie,telugu cinema,ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్,RRR క్లైమాక్స్‌లో నెగిటివ్ ఎండింగ్,రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్,నెగిటివ్ క్లైమాక్స్ ఆర్ఆర్ఆర్
ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ (RRR climax)

దేశం కోసం తమ ప్రాణాలు సైతం లెక్కచేయని వీర సైనికులుగా ఇందులో నటిస్తున్నారు వాళ్లు. అయితే అంతా అనుకుంటున్నట్లు ట్రిపుల్ ఆర్ దేశభక్తి సినిమా కాదని.. స్నేహం విలువ చెప్పే కథ అంటున్నాడు రాజమౌళి. అయితే క్లైమాక్స్‌లో కళ్లు, కాళ్లు పోయినా కూడా ట్రాజిక్ క్లైమాక్స్‌లా కాకుండా చాలా ఎమోషనల్‌గా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు రాజమౌళి. అయితే రిలీజ్‌కు ఆర్నెళ్ల ముందుగానే కావాలనే క్లైమాక్స్ గురించి ఫీలర్ వదిలారని తెలుస్తుంది. దీనికి వచ్చే రెస్పాన్స్ బట్టి మార్చాలా లేదంటే అలాగే ఉంచాలా అనేది నిర్ణయించుకోనున్నారు దర్శక నిర్మాతలు. త్వరలోనే రామ్ చరణ్, అలియా భట్‌పై రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించనున్నాడు దర్శకుడు రాజమౌళి.
Published by:Praveen Kumar Vadla
First published: