• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • UNEXPECTED SHOCK TO MEGASTAR CHIRANJEEVI ACHARYA MOVIE UNIT AND RAM CHARAN POOJA HEGDE SONG LEAKED ONLINE PK

Acharya Neelambari song leak: చిరంజీవి ‘ఆచార్య’ యూనిట్‌కు షాక్.. రామ్ చరణ్, పూజా హెగ్డే సాంగ్ లీక్..

Acharya Neelambari song leak: చిరంజీవి ‘ఆచార్య’ యూనిట్‌కు షాక్.. రామ్ చరణ్, పూజా హెగ్డే సాంగ్ లీక్..

ఆచార్యలో చిరంజీవి (Chiranjeevi Acharya)

Acharya Neelambari song leak: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా నటిస్తున్న ఆచార్య(Acharya) సినిమాను కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) హీరోయిన్‌గా నటిస్తున్నారు. రామ్ చరణ్(Ram Charan), పూజా హెగ్డే మరో జోడీగా నటిస్తున్నారు. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ.

  • Share this:
ఏం చేసినా.. ఎంత చేసినా ఈ రోజుల్లో లీకులు మాత్రం ఆగడం లేదు. పెద్ద సినిమాలైనా చిన్న సినిమాలైనా కూడా లీక్స్ మాత్రం కామన్‌గా జరుగుతున్నాయి. ఇప్పుడు చిరంజీవి ఆచార్య సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. తాజాగా ఈ చిత్రంలోని ఓ పాట లీక్ అయింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాను కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. రామ్ చరణ్, పూజా హెగ్డే మరో జోడీగా నటిస్తున్నారు. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ. ఇప్పటికే ఈ చిత్రంలోని లాహే లాహే పాటను విడుదల చేసారు. దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. చాలా ఏళ్ళ తర్వాత చిరంజీవి సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందచింని ఈ పాటకు మంచి స్పందన వస్తుంది. సాహితి, హరితా నారాయణ్ ఈ పాటను పాడారు. లాహే లాహే తర్వాత మిగిలిన పాటలపై కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆచార్య నుంచి ఓ పాట లీక్ అయింది.

నీలాంబరి అంటూ సాగే ఈ పాటను రామ్ చరణ్, పూజా హెగ్డేపై చిత్రీకరిస్తున్నారు దర్శకుడు కొరటాల. కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్ కొన్ని రోజులుగా ఆగిపోయింది. ఈ చిత్రంలో అరగంట పాటు ఉండే పాత్ర చేస్తున్నారు రామ్ చరణ్. ఈయనకు జోడీగా పూజా నటిస్తున్నారు. ఈ ఇద్దరిపై మంచి డ్యూయెట్ కూడా ఉంది.
chiranjeevi,chiranjeevi twitter,ram charan twitter,chiranjeevi ram charan acharya movie,chiranjeevi ram charan acharya movie neelambari song leaked,chiranjeevi ram charan acharya movie mani sharma music,chiranjeevi ram charan acharya movie koratala siva,chiranjeevi ram charan acharya movie song leaked online,pooja hegde ram charan,రామ్ చరణ్ పూజా హెగ్డే ఆచార్య,రామ్ చరణ్ పూజా హెగ్డే నీలాంబరి సాంగ్ ఆచార్య లీక్,చిరంజీవి రామ్ చరణ్ కొరటాల శివ ఆచార్య
ఆచార్యలో రామ్ చరణ్ పూజా హెగ్డే (Ram Charan Pooja Hegde)

అదే నీలాంబరి.. తాజాగా ఈ పాటకు సంబంధించిన లిరిక్ సోషల్ మీడియాలో లీక్ అయింది. నీలాంబరి అంటూ సాగే ఈ క్యాచీ ట్యూన్ కూడా అదిరిపోయింది అంటున్నారు అభిమానులు. అయితే ఇలా లీక్ అవ్వడంతో వాళ్లు కూడా బాధ పడుతున్నారు. ఈ పాటను వీలైనంత త్వరగా విడుదల చేయాలంటూ దర్శక నిర్మాతలను కోరుతున్నారు వాళ్లు. మే 13న ఆచార్య విడుదలవుతుందని ముందు చెప్పినా కూడా ఇప్పుడు కోవిడ్ కారణంగా మరోసారి వాయిదా పడిపోయింది. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా ఆచార్య సినిమాను నిర్మిస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: