Home /News /movies /

UMMADI KUTUMBAMTHO KAMMATI BHOJANAM ZEE TELUGU UGADI EVENT ON TODAY WILL BE STREEM NR

Ummadi Kutumbamtho Kammati Bhojanam: వామ్మో.. బేవర్సూ.. రివర్సూ కాదంటూ స్పోకెన్ 'ఇంగ్లిష్'ని నేర్పిస్తున్న మంచు లక్ష్మి!

Ummadi Kutumbamtho Kammati Bhojanam

Ummadi Kutumbamtho Kammati Bhojanam

    Ummadi Kutumbamtho Kammati Bhojanam: తెలుగు సినీ నటి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి పరిచయం గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈమె సినిమాలలో నటించగా అంత గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కానీ మోహన్ బాబు కూతురు గా మాత్రం మంచి పాపులారిటీని సంపాదించుకుంది. మంచు లక్ష్మి విషయంలో తను మాట్లాడే విధానం మాత్రం ఇప్పటికీ కాస్త ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఈమె మాట్లాడే ఇంగ్లీష్ భాష ప్రభావం తెలుగుపై కూడా ఉంటుంది. అంతే కాకుండా తాజాగా 'ఆర్' పదమును మళ్లీ హ్యాంగ్ చేసింది.

    నిజానికి ఈమె మాట్లాడే ఇంగ్లీష్ ఉచ్చారణ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా మంచు లక్ష్మి ఉగాది స్పెషల్ ఈవెంట్ సందర్భంగా జీ తెలుగులో లో 'ఉమ్మడి కుటుంబం తో కమ్మటి భోజనం' అనే పేరుతో స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఈ కార్యక్రమానికి ప్రదీప్ హోస్ట్ చేశాడు.‌ అంతేకాకుండా ఈ ఈవెంట్ కు నాగబాబు, నిహారిక, అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్, జానీ మాస్టర్ పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు.

    ఇక ఇందులో మంచు లక్ష్మి చేసిన ఓ సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. ఇంతకీ అందులో మంచు లక్ష్మి ఏం చేసిందంటే.. ఆమె వేదికపైకి ఎంట్రీ ఇవ్వగానే ప్రదీప్ ఆమెకు ఓ పేపర్ ఇస్తూ..' మీరు అర్జెంటుగా ఓ లెటర్ రాసి, చివర్లో యువర్స్ ప్రదీప్ అని మాత్రం రాయాలి ' అని అనగా వెంటనే మంచు లక్ష్మీ షాప్ అవుతూ బేవర్సూ.. రివర్సూ కాదు.. యూర్స్ అని ఆర్ అలా హ్యాంగ్ అవుతూ ఉండాలని మళ్ళీ తన ఇంగ్లీష్ ఉచ్చారణ భాషలో తెలిపింది. ఈ సన్నివేశాన్ని చూస్తూ అక్కడ ఉన్న ప్రేక్షకులందరూ తెగ నవ్వుకున్నారు. గతంలో మంచు లక్ష్మి కొన్ని వేదికలపై కూడా తన ఇంగ్లీష్ ఉచ్చారణ భాషను వదిలి క్లాస్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈవెంట్ ఈరోజు ఉదయం 10 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Anjali, Manchu Lakshmi, Niharika konidela, Ummadi Kutumbamtho Kammati Bhojanam, Varalakshmi sharat kumar, Zee telugu ugadi event

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు