హోమ్ /వార్తలు /సినిమా /

Sarkaru Vaari Paata First Review: సింహంలా మహేష్ బాబు..సర్కారు వారి పాటకు ఊహించని రేటింగ్

Sarkaru Vaari Paata First Review: సింహంలా మహేష్ బాబు..సర్కారు వారి పాటకు ఊహించని రేటింగ్

మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ (Twitter/Photo)

మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ (Twitter/Photo)

మహేష్ బాబు ఎంట్రీ సీన్ అదిరిపోయిందన్నారు ఉమర్ సంధు. ధమాకాదార్ సినిమా... ఆగ్ లగా దేగి ఆగ్ అంటూ.. సర్కారు వారి పాటపై ఆయన ప్రశంసలు కురిపించాడు.

మహేష్ బాబు (Mahesh Babu) కీర్తి సురేష్ జంటగా వస్తున్న మూవీ‘సర్కారు వారి పాట’(Sarkaru Vaari Paata). పరశురాం డైరెక్షన్‌లో వస్తున్న ఈ  సినిమా ఈనెల 12న థియేటర్లలో సందడి చేయనుంది.తమన్ ఈ ఈ సినిమాకు సంగీతం అందించారు. దీంతో మహేష్ అభిమానులు సర్కారు వారి పాట కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.  ప్రముఖ సెన్సార్ సభ్యులు, విశ్లేషకుడు అయిన ఉమర్ సంధు(Umair Sandhu) 'సర్కారు వారి పాట' ని వీక్షించి తన అభిప్రాయాన్ని ట్విట్టర్లో వెల్లడించాడు.

మ‌హేష్ బాబు క్రూర మైన సింహంలా కనిపించాడని...  హీరో నటన, అతను కోపాన్ని ప్రదర్శించిన ప్రతిసారీ స్క్రీన్‌‌పై మంట పుట్టిస్తాడని.. తెలిపాదు. అంతేకాదు.. సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)కి  మహేష్ ఫుల్ జోష్ ఇస్తాడన్నారు. ఇప్పటి వరకు ఆయన చేసిన అత్యుత్తమ సినిమాల్లో సర్కారు వారి పాట కూడా నిలుస్తుందన్నాడు ఉమర్ సంధు. దీంతో పాటు ఆన్ స్క్రీన్ పై మహేష్ చాలా హ్యాండ్ సమ్‌గా సెక్సీగా కనిపించాడన్నాడు. అతడి స్టైలిష్ డ్రెస్సింగ్ కూడా అందర్నీ ఆకట్టుకుంటాయని తెలిపాడు.

ఇక సర్కారు వారి పాట హిందీలో రిలీజ్ అయితే.. ఈ సినిమా కూడా పుష్ప,కేజీఎఫ్,ఆర్ఆర్ఆర్‌లా అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటుందన్నారు. ధమాకాదార్ సినిమా... ఆగ్ లగా దేగి ఆగ్ అంటూ.. సర్కారు వారి పాటపై ఉమర్ సంధు ప్రశంసలు కురిపించాడు.అంతేకాదు ఈ సినిమాకు అతడు.... 4.5 రేటింగ్ కూడా ఇచ్చాడు.


2022 కి ఇది తన ఫేవరెట్ ఫిలిం అంటూ ఉమర్ సంధు తెలిపాడు.మహేష్ బాబు మంచి ఫామ్లో ఉన్నాడని, నిర్మాతగా కూడా అతను మంచి కంటెంట్ ఉన్న కథల్ని ఎంపిక చేసుకుంటున్నాడని… 'సర్కారు వారి పాట' 'మేజర్' సినిమాలు ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నట్టు చెప్పుకొచ్చాడు. దీంతో మహేష్ అభిమానులు సర్కారు వారి పాట బొమ్మ హిట్ కొట్టడం ఖాయమని ఫుల్ ఖుషీలో ఉన్నారు.  మరి మన తెలుగు ప్రేక్షకులు మహేష్ సినిమాకు ఎలాంటి రేటింగ్ ఇస్తారో చూడాలి.

First published:

Tags: Keerthi Suresh, Mahesh Babu, Sarkaru Vaari Paata

ఉత్తమ కథలు