ప్రపంచమంతా ఇప్పుడు ఉక్రెయిన్ (Ukraine) వైపు చూస్తోంది. రష్యా యుద్ధం ప్రకటించాక ఉక్రెయిన్‌లో శిథిల భవనాలు.. కళావిహీనంగా పార్కులు మారాయి. అయితే ఎన్నో అందమైన లొకేషన్లకు చిరునామాగా ఉండే ఉక్రెయిన్‌లో పలు తెలుగు సినిమాలు షూటింగ్ చేసుకొన్నాయి. ఇప్పుడంటే రష్యా సైనిక చర్యతో ఉక్రెయిన్ బాంబుల మోతతో దద్దరిల్లిపోతోంది. రష్యా సేనల బాంబు దాడుల్లో ఒకవైపు ఉక్రెయిన్ సైనిక స్థావరాలు కుప్పకూలుతుండగా.. మరోవైపు అమాయక ప్రజలు మృత్యువాతపడుతున్నారు. దాదాపు అన్ని అందమైన ప్రదేశాలు దెబ్బతింటున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో తెలుగు సినిమా (Telugu Cinema)కు ఉక్రెయిన్‌కు ఉన్న లింక్ ఏంటో తెలుసుకోండి.
Ukraine Russia War: ఉక్రెయిన్, రష్యా జెండాలతో జంట.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో!
సాయిధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం విన్నర్. ఈ సినిమాల 2017లో వచ్చింది. ఉక్రెయిన్‌లో పలు సన్నివేశాలు షూటింగ్ నిర్వహించారు. తరువాత తమిళ హీరో కార్తి కథానాయకుడిగా రజత రవి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'దేవ్స. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను 2018లో ఉక్రెయిన్‌లో తీశారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. ఇండియన్ బిగ్ డైరెక్టర్స్‌లో ఒక్కరైన శంకర్ నిర్మించిన రోబో 2.0 సినిమా కూడా ఉక్రెయిన్‌లో షూటింగ్ చేశారు. ఓ పాటను అక్కడే తీశారు. పలు సన్నివేశాలను ఉక్రెయిన్‌లో నిర్మించారు.
ఆర్ఆర్ఆర్:
దేశం మొత్తం ఎదురు చూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ (RRR). ఈ సినిమాను అంచనాలకు మించి నిర్మించింది ఎస్ఎస్ రాజమళి. చాలా గ్రాండ్ విజువల్‌తో నిర్మించిన ఈ సినమాలో ఇప్పటికే సూపర్ హిట్ అయిన పాట 'నాటు నాటు' సాంగ్‌ను ఉక్రెయిన్‌లోని ప్యాలెస్‌లో చిత్రీకరించారు. గత ఆగస్టులో ఆర్ఆర్ఆర్ చివరి షెడ్యూల్ కోసం చిత్ర బృందం ఉక్రెయిన్ వెళ్లింది. సినిమాలోని పలు ముఖ్యమైన సన్నివేశాలు కూడా ఉక్రెయిన్‌లోనే తెరకెక్కాయి.
Ukraine Crisis: అవసరాలు, అహం, ఆత్మాభిమానం.. ఉక్రెయిన్ సంక్షోభానికి కారణాలు ఏంటీ?
ఉక్రెయిన్, రష్యా (Russia) యుద్ధం కారణంగా ఉక్రెయిన్ పర్యాటకంపై తీవ్ర ప్రభావం పడుతుంది. రష్యా బలగాలు సరిహద్దులను దాటి ఉక్రెయిన్‌లోకి ప్రవేశించి దాడులు చేస్తుండటంతో అక్కడ ఎన్నో పర్యాటక ప్రాంతాలు ధ్వంసమవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు చిత్రాలు అక్కడ నిర్మాణాలు జరుపుకొంటాయి. ఇటీవల ఇండియా నుంచి చాలా సినిమాలు షూటింగ్‌ల కోసం ఉక్రెయిన్ బాట పడుతున్నాయి.
ఉక్రెయిన్‌పై అన్ని వైపులా దాడులు చేస్తోంది రష్యా సైన్యం. మిసైల్, వైమానిక దాడుల్లో ఉక్రెయిన్ మిలటరీ వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎక్కడ చూసినా ఇలాంటి విధ్వంసక, భయానక దృశ్యాలే కనిపిస్తున్నాయి. రష్యా బలగాలు- ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు దగ్గర్లోని ఖెర్సన్లోకి ప్రవేశించాయి. ఆ ప్రాంతంపై పట్టు బిగించాయి. ఉక్రెయిన్‌లోని మిలటరీ స్థావరాలను ఉక్కిరబిక్కిరి చేసి, పూర్తిగా పట్టుబిగిస్తున్నాయి రష్యా బలగాలు. అయితే తాము వెయ్యి మంది రష్యన్ సైనికులను చంపేసినట్లు ఉక్రెయిన్ చెబుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Russia-Ukraine War, Telugu movies, Ukraine