Ugadi Jathirathnalu: బుల్లితెరలో ఎన్నో ఎంటర్టైన్మెంట్, రియాలిటీ షో లు ప్రసారమవుతుంటాయి. ఇప్పటికే పలు చానల్లో ఎన్నో ఎంటర్టైన్మెంట్ అందించే షోలు వస్తున్నప్పటికీ.. బుల్లితెరలో ఇలాంటి షో ద్వారానే చానల్స్ కు టిఆర్పి రేటింగ్ ఎక్కువగా వస్తుంటాయి. అందుకే ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఈ షో లలో ఎంటర్టైన్మెంట్ తో పాటు కాస్త పండగ వాతావరణాన్ని కూడా చూపిస్తుంటారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం 'ఉగాది జాతిరత్నాలు' టైటిల్ తో స్పెషల్ ఈవెంట్ రానుంది.
ఏదైనా పండుగల సందర్భంలో ఆ చానల్ లో వచ్చే ప్రోగ్రాములు బృందం అంతా ఒకే వేదికపై చేరి స్పెషల్ ఈవెంట్ ప్లాన్ లు చేస్తుంటాయి. ఇక తాజాగా ఉగాది సందర్భంగా ఈటీవీ లో స్పెషల్ ఈవెంట్ ఉగాది జాతి రత్నాలు అనే టైటిల్ తో రానుంది. ఇక దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో పాల్గొన్న కంటెస్టెంట్ లు, జడ్జీలు చేసిన సందడి లో మాత్రం బాగా ఆకట్టుకున్నాయి.
తెలుగు సినీ నటి పూర్ణ డీ షో లో జడ్జిగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈమె జబర్దస్త్ టీమ్ తో కలిసి ఓ సన్నివేశాన్ని చేయగా.. అందులో తన తెలుగు భాష బాగా ఆకట్టుకుంది. ఇక తమకు ఇష్టమైన అభిమాన హీరోల పోస్టర్లతో వేదికపై.. ఏకంగా ఫైట్ నే చేశారు. మా హీరో గొప్ప అంటూ లేదు మా హీరో నే గొప్ప అంటూ తెగ ఎంటర్టైన్ చేశారు. ఇదిలా ఉంటే ఈమధ్య ఉప్పెన రొమాంటిక్ సాంగ్ ఎంత ఆకట్టుకుందో తెలిసిందే. ఇక ఈ పాటను సుడిగాలి సుధీర్.. రష్మి తో కలిసి ఏకంగా సినిమా స్టైల్ లో రొమాంటిక్ నే దింపేశారు. మొత్తానికి ఈ ఈవెంట్ ప్రోమో లో బాగా ఆకట్టుకోగా.. ఈ ఎపిసోడ్ ఉగాది రోజు ఉదయం 9 గంటలకు ఈటీవీ లో ప్రసారం కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor pradeep, Hyper Adhi, Purna, Ugadi Jathirathnalu, Ugadi special show