Nuvvu Nenu final collections: ‘నువ్వు నేను’ ఫైనల్ కలెక్షన్స్.. స్టార్ హీరోలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఉదయ్ కిరణ్..

ఉదయ్ కిరణ్ నువ్వు నేను కలెక్షన్స్ (Nuvvu Nenu collections)

Nuvvu Nenu final collections: ఎక్కడ్నుంచి వచ్చాడో తెలికదు.. చిత్రం అంటూ తెలుగు సినిమాకు పరిచయం అయ్యాడు ఉదయ్ కిరణ్ (Uday Kiran). ఆ తర్వాత వరస విజయాలు అందుకున్నాడు. పెద్ద పెద్ద హీరోలకు కూడా సాధ్యం కాని విధంగా తన సినిమాలతో మాయ చేసాడు.

  • Share this:
ఎక్కడ్నుంచి వచ్చాడో తెలికదు.. చిత్రం అంటూ తెలుగు సినిమాకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వరస విజయాలు అందుకున్నాడు. పెద్ద పెద్ద హీరోలకు కూడా సాధ్యం కాని విధంగా తన సినిమాలతో మాయ చేసాడు. బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించాడు.. ఎవరబ్బా ఈ కుర్రాడు..? ఉదయ్ కిరణ్ గురించి మిలీనియం మొదట్లో వినిపించిన మాటలు ఇవి. ఉదయ్ దూకుడు చూసి స్వయంగా చిరంజీవి ముచ్చటపడి మరీ తన అల్లుడిని చేసుకోవాలనుకున్నాడు. ఆ తర్వాత కథ అంతా వేరేగా జరిగింది. అదంతా పక్కనబెడితే చిత్రం తర్వాత ఏడాది ఖాళీగానే ఉన్న ఉదయ్.. మరోసారి తేజతోనే చేసిన సినిమా నువ్వు నేను. ఆగస్ట్ 10, 2001న విడుదలైన ఈ చిత్రానికి నేటితో 20 ఏళ్ళు పూర్తయ్యాయి.

అప్పట్లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ చూసి ట్రేడ్ కూడా షాక్ అయింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు చాలా మంది స్టార్ హీరోల సినిమాలు కూడా అప్పట్లో అంత వసూలు చేయలేదు. కానీ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన ఉదయ్ మాత్రం నువ్వు నేనుతో ప్రభంజనం సృష్టించాడు.

నైజాం: 4.65 కోట్లు
సీడెడ్: 1.55 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.62 కోట్లు
ఈస్ట్: 1.11 కోట్లు
వెస్ట్: 0.89 కోట్లు
గుంటూరు: 0.93 కోట్లు
కృష్ణా: 0.85 కోట్లు
నెల్లూరు: 0.52 కోట్లు

ఏపీ + తెలంగాణ: 12.09 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 3.44 కోట్లు
వరల్డ్ వైడ్: 15.39 కోట్లు

చిత్రం సినిమా విజయం సాధించడంతో ‘నువ్వు నేను’ బిజినెస్ కూడా బాగానే జరిగింది. అప్పట్లో తేజకు ఉన్న మార్కెట్ దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను 3.2 కోట్లకు కొన్నారు బయ్యర్లు. విడుదలకు ముందు అంత వస్తుందా అని చాలా మంది విమర్శించారు. కానీ నువ్వు నేను విడుదలైన మార్నింగ్ షో నుంచే సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. 200 రోజులు ఆడింది ఈ చిత్రం. దెబ్బకు ఉదయ్ కిరణ్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఒకటి రెండు కాదు.. 3 కోట్ల లక్ష్యంతో దిగితే 15.33 కోట్ల షేర్ వసూలు చేసి 13 కోట్ల లాభాలు తీసుకొచ్చింది ఈ చిత్రం.
Published by:Praveen Kumar Vadla
First published: