కన్ఫ్యూజనే పవన్ కళ్యాణ్ జనసేన కొంప ముంచిందా..

జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ తాను పోటీచేసిన భీమవరం, గాజువాక రెండు స్థానాలలో ఓటమిపాలయ్యారు. పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజనే ఆయన కొంప ముంచిందా.

 • Share this:
  పవన్ కళ్యాణ్ తాను పోటీచేసిన భీమవరం, గాజువాక రెండు స్థానాలలో ఓటమిపాలయ్యారు. పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజనే ఆయన కొంప ముంచిందా.. దీంతో ఆయన ఆభిమానులు తీవ్ర నిరాశకు గురైయ్యారు. ఒక దశలో పవన్ కల్యాణ్ జనసేనకు కనీసం 40 నుంచి 50 స్థానాలు వస్తాయన్నారు. అలాంటిది కేవలం ఒక్క స్థానంతోనే  జనసేన సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఐతే.. పవన్ కల్యాణ్ స్వతహాగా చేసిన కొన్ని తప్పిదాలే  జనసేన కొంపముంచాయి అంటున్నారు ఆయన్ని రాజకీయ వ్యవహారశైౌలిని గమనిస్తున్న కొందరు రాజకీయ విశ్లేషకులు. పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి ఎన్నికల ప్రచారంలో చేసిన కొన్ని పొరపాట్లపై ఇప్పుడు చర్చలు మొదలయ్యాయి. ఎన్నికల సమయానికి అన్ని నియోజక వర్గాలలో తన అభ్యర్థులను ప్రకటించక పోవడం ఇతర పార్టీలకు కలిసొచ్చిందంటు వ్యాఖ్యాలు చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి అనుభవజ్ఞులైన సీనియర్ నాయకులు జనసేనలోకి రావడానికి సిద్ధంగా ఉన్నా వారిని పార్టీలోకి రావద్దని చెప్పేసాడు. అప్పట్లో అన్నయ్య ప్రజా రాజ్యంలోకి వేరే పార్టీల నుంచి వచ్చిన నాయకులకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం వల్లే... ప్రజా రాజ్యానికి ప్రజల మద్దతు దక్కలేదనే భావతో.. పవన్ కళ్యాణ్ అలాంటి తప్పులు జరగకూడదని ఒకరిద్దరు మినహా వేరే సీనియర్ పొలిటిషన్స్ ఎవరినీ పార్టీలోకి తీసుకోలేదు.

  పవన్ కళ్యాణ్ తాను పోటీచేసిన భీమవరం, గాజువాక రెండు స్థానాలలో ఓటమిపాలయ్యారు. పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజనే ఆయన కొంప ముంచిందా.
  పవన్ కళ్యాణ్, నాగబాబు (File)


  పవన్ వేరే పార్టీలకు చెందిన పొలిటిషన్స్‌ను తీసుకోకపోవడంపై  పవన్ తనపై తనకున్న అతి విశ్వాసానికి అద్దం పడుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.  ప్రచారంలో చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి విధానాలను పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రసంగాల్లో సరిగా టార్గెట్ చేయలేకపోవడం, పార్టీ పెట్టినప్పుడు సీఎం అయ్యే ఉద్దేశంలేదంటూ ఒకలా, ఆ తరవాత ప్రచారంలో ఓట్లు వేస్తే ముఖ్యమంత్రినవుతా అంటూ మరో మాట మాట్లాడటం.ఇలా ఒక్కొక్కటి పవన్ కళ్యాణ్ ఓటమికి కారణమయ్యాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  పవన్ కళ్యాణ్ తాను పోటీచేసిన భీమవరం, గాజువాక రెండు స్థానాలలో ఓటమిపాలయ్యారు. పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజనే ఆయన కొంప ముంచిందా.
  పవన్ కళ్యాణ్


  పవన్ చాలాతేలికగా ఈ ఎలెక్షన్స్ లో గెలుపొందుతానే అతి విశ్వాసం ఆయన కొంప ముంచిదంని అందరు భావిస్తున్నారు. అందుకే ఆయన పార్టీలో చేరడానికి చాలామంది సీనియర్ నేతలు, సెలెబ్రెటీలు సిద్ధమైన వారిని పక్కన పెట్టారు.  ప్రజానాడిని పట్టడంలో పవన్‌కున్నఅనుభవం సరిపోలేదంటూ ఓటమికిగల కారణాలు అన్వేషిస్తున్నారు జనసేన అభిమానులు. ఏది ఏమైనా పార్టీ నాయకుడే ఎన్నికల్లో గెలవలేని ప్రస్తుత స్థితిలోవున్న జనసేన పార్టీని పవన్ కల్యాణ్ ముందు ముందు ఎలా నడిపిస్తారో చూడాలిమరి.
  First published: