Home /News /movies /

TWO ACTORS FILMING NETFLIX SERIES THE CHOSEN ONE KILLED IN ROAD ACCIDENT SB

OMG: నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌ షూటింగ్‌లో ప్రమాదం.. ఇద్దరు హీరోలు మృతి..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండే సిరీస్ కాబట్టి ఎడారి ప్రాంతంలో షూటింగ్ మొదలుపెట్టారు. అయితే షూటింగ్ జరుగుతున్న పక్కన ఒక రోడ్ ఉంది. రోడ్డుపై వెళ్తున్న వ్యాన్‌ పల్టీలు కొడుతూ షూటింగ్ స్పాట్‌లోకి దూసుకువెళ్లింది.

    ఎవరి చావు ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం. విధి ఎప్పుడు ఏ ప్రాణాన్ని బలితీసుకుంటుందో చెప్పలేం. తాజాగా ఓ ప్రమాదం.. షూటింగ్ సెట్‌లో కూర్చున్న హీరోల ప్రాణాలు బలితీసుకుంది. సాధారణంగా సినిమా షూటింగులు జరుగుతున్నప్పుడు సెట్‏లో కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతుంటాయి. యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్న సమయంలో ప్రమాదాలు జరగడం కామన్. ఇలాంటివి జరిగినప్పుడు.. నటీనటులతో పాటు మిగతావారికి గాయాలవుతుంటాయి. అయితే తాజాగా ఇద్దరు హీరోలు... మృత్యువాత పడ్డారు.

    గతంలో భారతీయుడు 2 సినిమా షూటింగ్ సెట్‏లో జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి ప్రమాదమే మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా సుర్ ద్వీపకల్పంలో జరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు హీరోలు చనిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ తెరకెక్కిస్తున్న ఒరిజినల్ సిరీస్‌ ‘ది చూసెన్‌ వన్‌’. బ్రెజిలియన్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ గా 2019 లో రిలీజైన ఈ సిరీస్ భారీ విజయాన్ని అందుకొంది. దీంతో నెట్‌ఫ్లిక్స్‌ వరుస సీజన్లను రిలీజ్ చేస్తూ వచ్చింది. ఈ మధ్యనే రెండో సీజన్ కూడా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ ను అందుకుంది. దీంతో వెంటనే మూడో సీజన్ షూటింగ్ ను మొదలుపెట్టారు.



    భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండే సిరీస్ కాబట్టి బాజా కాలిఫోర్నియా సమీపంలోని శాంటా రోసాలియా ఎడారి ప్రాంతంలో షూటింగ్ మొదలుపెట్టారు. అయితే షూటింగ్ జరుగుతున్న పక్కన ఒక రోడ్ ఉంది. గురువారం షూటింగ్ జరుగుతున్న సమయంలో.. ఎడారి ప్రాంతంలో రోడ్డుపై వెళ్తున్న వ్యాన్‌ పల్టీలు కొడుతూ షూటింగ్ స్పాట్‌లోకి దూసుకువెళ్లింది. ఆ వ్యాన్ షూటింగ్ సెట్ లో ఉన్న నటులు రేముండో గుర్డానో, జువాన్‌ ఫ్రాన్సిస్కో అగ్యిలర్‌ తో పాటు మరో ఆరుగురి పైన పడింది. ఈ అనుకోని సంఘటనకు అవాక్కయిన చిత్ర బృందం వెంటనే తేరుకొని చూసేసరికి ఇద్దరు నటులు మృత్యువాత పడగా ఆరుగురు తీవ్ర గాయాలతో తప్పించుకున్నారు.

    మరణించిన నటులు రేముండో గుర్డానో, జువాన్ ఫ్రాన్సిస్కో అగ్విలర్ గా గుర్తించారు కాలిఫోర్నియా పోలీసులు. ది హాలీవుడ్ రిపోర్ట్ ప్రకారం ఈ ప్రమాదం జూన్ 16న జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. అయితే ఇప్పటివరకు నెట్‌ఫ్లిక్స్‌ ఈ విషయాన్నీ ప్రస్తావించకపోవడం విశేషం.. దీంతో నెట్‌ఫ్లిక్స్‌ పై బ్రెజిల్ మీడియా, అభిమానులు మండిపడుతున్నారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Hollywood, Netflix

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు