Home /News /movies /

TWINKLE KHANNA INTERESTING COMMENTS ON KARAN JOHAR BIRTHDAY PARTY SB

రాత్రి హ్యాంగోవర్ దిగలేదన్న హీరోయిన్... పిలిస్తే వెళ్లిపోవడమేనన్న నెటిజన్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రాత్రి తాగింది ఎక్కువయ్యింది. తెల్లారేసరికి హ్యాంగోవర్ దిగలేక... తల పట్టేస్తుందంటూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది హీరోయిన్. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

  సెలబ్రిటీలకు పార్టీలు... పబ్‌లు కామన్. పార్టీల్లో మందు తాగుతూ, చిందులు వేయడం.. తాగింది దిగేవరకు గంతులు వేస్తుంటారు. అయితే బడా సెలబ్రిటీలు మాత్రం బడా పార్టీలకు వెళ్తుంటారు. మరి బడా బాబులు ఇచ్చే పార్టీలు మామూలుగా ఉండవు. కావాల్సినంత కిక్ ఉంటుంది అక్కడ. ఇటీవల బాలీవుడ్‌లో బిగ్ పార్టీ జరిగింది. ఆ పార్టీకి ప్రముఖ తారలంతా తరలివెళ్లారు. తారల తళుక్కులతో పార్టీకి ఉన్న క్రేజ్ డబుల్ అయ్యింది. బాలీవుడ్(Bollywood) బడా నిర్మాత కరణ్ జోహార్(Karan Johar) గురించి తెలిసింది. పార్టీలకు పెట్టింది పేరు. ఇక ఈయన ఇంట్లో పార్టీ అంటే ఏ సెలబ్రిటీ కూడా వెళ్లకుండా ఉండడు. ఎంత ముఖ్యమైన పనులు ఉన్నా పక్కన పెట్టి సెలబ్రేషన్స్‌కు రెక్కలు కట్టుకొని వాలిపోతారు.

  తాజాగా అర్ద శతాబ్ధాన్ని పూర్తిచేసుకొనే కరణ్ జోహార్ పార్టీ ఎలా ఉంటుంది.. అంగరంగ వైభవంగా ఈ వేడుక మొదలయ్యింది. బాలీవుడ్ స్టార్ జంటలు రాత్రి అంతా మద్యం మత్తులో మునిగి తేలారు.. ఇక బర్త్ డే బాయ్, హీరోయిన్లతో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. హీరో హీరోయిన్లతో కలిసి చిందులు వేశాడు కరణ్. ఇక ఈ పార్టీకి అక్షయ్ కుమార్ తన భార్య ట్వింకిల్ ఖన్నాతో హాజరయ్యాడు. ఇక ఆ పార్టీలో ట్వింకిల్ ఖన్నా ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇక ఉదయం మాత్రం అమ్మడు హ్యాంగోవర్ తో తలా పట్టుకుంది. ఆ ఫ్రస్టేషన్ లో ట్వింకిల్ ఖన్నా సోషల్ మీడియా లో అర్థ్రరాత్రి వరకు జరిగిన కరణ్ బర్త్ డే పార్టీలో మందు తాగానని ఆ హ్యాంగోవర్ పోవడం లేదని ఇలాంటి పార్టీని ఏర్పాటు చేస్తున్న కరణ్ జోహార్ ని బ్యాన్ చేయాల్సిందేనని చెప్పుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసిన వారందరూ.. ఆయన పిలిస్తే వెళ్లిపోవడమేనా.. నీకు లిమిట్ ఉండాలి గా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

  బాలీవుడ్ నుంచి కరణ్ ను బ్యాన్ చేయాలంటూ పోస్ట్ చేసింది ట్వింకిల్ ఖన్నా. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారింది. కరణ్ తన పార్టీలతో హ్యాంగోవర్ ఇస్తున్నాడట.. ఉదయం ఆమె లేవడానికి ఇబ్బంది పడుతుందట.. అందుకే కరణ్ ను బ్యాన్ చేస్తే పార్టీలు ఉండవు.. అమ్మడు హ్యాపీగా ఉండొచ్చు అని ఆమె అర్ధం వచ్చేలా పోస్టు పెట్టింది ట్వింకిల్. ఇక కరణ్ జోహార్ ఎలాంటి పార్టీ అయినా ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాడు. బాలీవుడ్‌లో మొదటి నుంచి కరణ్ ప్రైవేట్ పార్టీలకు పెట్టింది పేరు. ఇక కరణ్ పెట్టిన తాజా పార్టీకి టాలీవుడ్ నుంచి కూడా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రష్మిక ,విజయ్ దేవరకొండ,పూరి జగన్నాథ్, చార్మి ఈ పార్టీలో సందడి చేశారు.
  Published by:Sultana Shaik
  First published:

  Tags: Akshay Kumar, Bollywood, Karan Johar

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు