బిత్తిరి సత్తికి బంపరాఫర్.. ఆ ఛానెల్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న చేవెళ్ల రవి..

బిత్తిరి సత్తి, ఇస్మార్ట్ సత్తి, తుపాకి రాముడు.. ఇలా ఏ పాత్ర వేసినా అందులో ఒదిగిపోయే వ్యక్తి.. బిత్తిరి సత్తి ఉరఫ్ రవికుమార్.. ఈయన ఇప్పుడు తెలుగు టీవీతెరపై తెలియని ప్రేక్షకులు అరుదుగా ఉంటారు. రీసెంట్‌‌గా టీవీ9 ఛానెల్ నుంచి బయటకు వచ్చిన ఈయన మరో బిగ్ చానెల్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్టు సమాచారం.

news18-telugu
Updated: July 7, 2020, 9:51 PM IST
బిత్తిరి సత్తికి బంపరాఫర్.. ఆ ఛానెల్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న చేవెళ్ల రవి..
బిత్తిరి సత్తి (File/Photo)
  • Share this:
బిత్తిరి సత్తి, ఇస్మార్ట్ సత్తి, తుపాకి రాముడు.. ఇలా ఏ పాత్ర వేసినా అందులో ఒదిగిపోయే వ్యక్తి.. బిత్తిరి సత్తి ఉరఫ్ రవికుమార్.. ఈయన ఇప్పుడు తెలుగు టీవీతెరపై తెలియని ప్రేక్షకులు అరుదుగా ఉంటారు. జీరో నుంచి మొదలై హీరో స్థాయికి ఎదిగిన బిత్తిరి సత్తి... సాధారణ యాంకర్‌గా మొదలైన  బిత్తిరి సత్తి ప్రయాణం ఇప్పుడు చాలా దూరం వెళ్లిపోయింది. ఈయన వీ6న్యూస్ ఛానెల్ నుంచి ఈయన జర్నీ మొదలైంది. అంతకు ముందు ఒక  ఛానెల్లో పనిచేసినా.. అసలు ప్రయాణం మాత్రం వీ6తోనే మొదలైంది. తన న్యూస్ చదువుకుని.. తీన్మార్ స్టెప్పులు వేయించి వెళ్లిపోయే సత్తి ఇప్పుడు తనే న్యూస్ అయిపోయాడు. ఉన్నట్లుండి వీ6 ఛానెల్ మారిపోయి..TV 9 ఛానెల్ వెళ్లిపోయాడు. అక్కడ ఆయన తీన్మార్ వార్తలు లాగే  ‘ఇస్మార్ట్ న్యూస్’ అనే ప్రోగామ్‌ను స్టార్ట్ చేసాడు. కానీ అక్కడ ఈ ప్రోగ్రామ్ అంతగా పేలలేదు. దీంతో టీవీ 9 యాజమాన్యం టీఆర్‌పీలు లేకపోవడం.. పైగా ఓ ఫాదర్స్ డే సందర్భంగా సత్తి చేసిన ప్రోగ్రామ్ ఛానెల్ యాజమాన్యం ఆగ్రహానికి గురికావడం.. వారు వెంటనే అతన్ని ఈ  ఛానెల్‌ నుంచి నిష్క్రమించేలా చేసారు. తాజాగా బిత్తిరి సత్తి.. బిగ్‌బాస్ 4లో ఎంట్రీ ఇస్తున్నాడనే వార్తలు కూడా వినిపించాయి. తాజాగా బిత్తిరి సత్తి.. ఏపీ ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి ఛానెల్‌లోకి వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా ఏపీ సీఎంకు చెందిన ఈ ఛానెల్‌లో బిత్తిరి సత్తి ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 7, 2020, 9:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading