సీరియల్స్ షూటింగ్‌లకు అనుమతులు ఇవ్వాలంటూ తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను టీవీ చానళ్ల ప్రతినిధులు కలిసి విజ్ఞప్తి చేశారు. మార్చి 24న లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత నుంచి అన్ని రకాల సినిమా షూటింగ్‌లు, టీవీ సీరియల్ షూటింగ్‌లు నిలిచిపోయాయి. అప్పటి వరకు చేసిన షూటింగ్ పార్ట్లు ఎడిటింగ్ చేసి ప్రసారం కూడా చేశారు. ఆ తర్వాత సినిమా షూటింగ్స్ లేకపోవడంతో నటులు, సాంకేతిక సిబ్బంది, ఇతరత్రా సినిమాలు, షూటింగ్‌ల మీద ఆధారపడి జీవించే కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే, లాక్ డౌన్ సమయంలో ఇంటి దగ్గర ఉండే వారి కోసం టీవీ సీరియల్స్ ప్రసారం చేస్తే బావుంటుందని వారు మంత్రి తలసానికి చెప్పారు. ఈనెల 5న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఆ రోజు సీఎం కేసీఆర్‌తో చర్చించి ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి తలసాని తెలిపారు. సినిమా, సీరియల్స్ షూటింగ్స్ నిలిచిపోవడంతో పాత సీరియల్స్‌నే మొదటి నుంచి ప్లే చేస్తున్నాయి కొన్ని టీవీ చానళ్లు. అలాగే, దూరదర్శన్ చానల్లో రామాయణం ప్రసారం అయింది. రేపటి నుంచి శ్రీకృష్ణ సీరియల్ ప్రసారం కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.