టీవీ సీరియల్‌లో నిమగ్నం.. ఆపై మంటల్లో మహిళ సజీవదహనం..

TV Serials: ఈ రోజుల్లో సీరియల్స్‌కు ఎలాంటి క్రేజ్ ఉందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంట్లో ఎలాగూ భర్తలు ఉండరు.. అలాంటి సమయంలో ఆడవాళ్లకు టీవీ సీరియల్స్ చేదోడు వాదోడు అంతే. అందుకే వాటికి అంతగా కనెక్ట్ అవుతుంటారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 20, 2020, 6:24 PM IST
టీవీ సీరియల్‌లో నిమగ్నం.. ఆపై మంటల్లో మహిళ సజీవదహనం..
టీవీ సీరియల్ చూస్తూ మహిళ సజీవ దహనం
  • Share this:
ఈ రోజుల్లో సీరియల్స్‌కు ఎలాంటి క్రేజ్ ఉందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంట్లో ఎలాగూ భర్తలు ఉండరు.. అలాంటి సమయంలో ఆడవాళ్లకు టీవీ సీరియల్స్ చేదోడు వాదోడు అంతే. అందుకే వాటికి అంతగా కనెక్ట్ అవుతుంటారు. సినిమాలకు కూడా పూర్తిగా కలెక్షన్స్ పడిపోవడానికి ఈ సీరియల్స్ కూడా కారణమే. అంతగా వాటికి అంటుకుపోతున్నారు ఆడవాళ్లు. పక్కనుంచి ఇళ్లు దోచుకుపోయినా పట్టించుకోనంత బిజీగా సీరియల్స్ చూస్తుంటారంటూ సోషల్ మీడియాలో చాలా మీమ్స్ కూడా వచ్చాయి. అది నిజమే కూడా. ఇక ఈ సీరియల్స్ మోజులో పడి కాపురాలు కూడా కూలిపోతున్నాయి. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే జరిగింది. అంతేకాదు.. సీరియల్స్ చూసి అందులో మాదిరే తమ కారెక్టర్ కూడా మార్చుకోవాలని చూస్తుంటారు. ఇక ఇప్పుడు తమిళనాట జరిగిన ఓ ఘటన చూసి అంతా షాక్ అవుతున్నారు. ఓ టీవీ సీరియల్ కారణంగా మహిళ ప్రాణాలు కోల్పోయింది.
టీవీ సీరియల్ చూస్తూ మహిళ సజీవ దహనం
టీవీ సీరియల్ చూస్తూ మహిళ సజీవ దహనం

అసలు సీరియల్ మొదలైతే ప్రపంచం బద్ధలైపోయినా ఆడవాళ్ళు అక్కడ్నుంచి కదలరని చెప్పడానికి ఇదే నిదర్శనం. తమిళనాడులోని తిరువాయూరులో మహాలక్ష్మి అనే మహిళ భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంది. అయితే ఫిబ్రవరి 18 సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి సీరియల్ చూడడం మొదలుపెట్టింది ఈ మహిళ. అయితే దీపం అంటించిన సంగతి మరిచిపోయి మరీ సీరియల్‌లో మునిగిపోయింది. దాంతో ఆ దీపం కాస్తా పక్కకు ఒరిగి ఇంటి నిండా మంటలు వ్యాపించాయి. అయినా కూడా సీరియల్ ధ్యాసలో ఉండి గమనించుకోలేదు ఈమె. దాంతో ఇల్లు అంతా కాలిపోయింది. తీరా తేరుకుని మంటలార్పే ప్రయత్నం చేసినా కూడా కుదర్లేదు.. ఆ మంటలకే చిక్కి సజీవదహనం అయిపోయింది సదరు మహిళ. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. సీరియల్స్‌పై మోజు ఉండొచ్చు కానీ మరీ ప్రాణాల మీదకు తెచ్చుకునే ఇష్టం మాత్రం మంచిది కాదంటున్నారు విశ్లేషకులు.

First published: February 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు