Rithu Chowdary: రీతూ చౌదరి.. బుల్లితెరపై లేడీ విలన్స్ లో నెంబర్ వన్ ఈమె. తన నటనతో నెగటివ్ రోల్స్ పోషిస్తూ బిజీ బిజీగా మారిన నటి రీతూ చౌదరి. స్టార్ మా లో గోరింటాకు సీరియల్ లో గాయత్రీగా, జీ తెలుగులో ఇంటి గుట్టు సీరియల్ లో సంపదగా, జెమినీ టీవిలో గిరిజ కళ్యాణంలో విలన్ గా అన్ని ఛానెల్స్ ను కవర్ చేస్తూ ఫుల్ బిజిగా ఉంది రీతూ చౌదరి. మొదట యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఈ హైదరాబాదీ భామ ప్రస్తుతం సీరియల్స్, సినిమాలతో బిజీగా మారిపోయింది.
అలాంటి రీతూ వర్మ తన కాలేజీ క్రష్ గురించి.. సినిమాల్లో హీరోపైన ఉన్న క్రష్ గురించి బయటపెట్టేసింది. దీంతో ఆ విషయం విని అందరూ షాక్ కి గురవుతున్నారు. నిజానికి రీతూ చౌదరి.. యాంకర్ ప్రదీప్ పాపులర్ షో పెళ్లి చూపులులో పార్టిసిపేట్ చేసింది. ఆ తర్వాత ఆమె సీరియల్స్ లో అడుగు పెట్టింది. ఇప్పుడేమో ఆమె తన క్రష్ గురించి చెప్తూ.. సీరియల్స్ లో హీరోలు అందంగా ఉంటారు కానీ వాళ్లపై ఎప్పుడు క్రష్ అనేది ఏర్పడలేదు.. కానీ సినిమాల్లో మాత్రం అక్కినేని నాగచైతన్య అంటే ఎంతో ప్రేమ.
View this post on Instagram
నాగచైతన్యను కలిసే అవకాశం నాకు వచ్చింది. కానీ నేను కలవను ఆయన్ని దూరం నుంచే ప్రేమిస్తా.. నేనెవరో ఆయనకు తెలిసే వరకు ప్రేమిస్తూనే ఉంటా.. నా ప్రేమను పంచుతూనే ఉంటా అంటూ చెప్పుకొచ్చింది రీతూ చౌదరి. అంతేకాదు నాగార్జున గారు రియల్ మన్మథుడు అయన అయినా నాకు ఓకే అంటూ చెప్పుకొచ్చింది రైతు వర్మ. దీంతో ఈ విషయంపై నెటిజన్లు స్పందిస్తూ.. సమంతకు తెలిస్తే నీకు ఉంటుంది అని కొందరంటే.. మరికొందరు స్పందిస్తూ.. నాగచైతన్యతో ప్రేమ.. యాంకర్ ప్రదీప్తో పెళ్లిచూపులు మాములు కోరికలు కావుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor pradeep, Gorintaku serial, Inti guttu serial, Naga chaithanya, Rithu Chowdary