TV Actress sreevani: 16 ఏళ్లకే అక్కడికి తీసుకెళ్లి ముద్దు పెట్టాడంటూ సీరియల్ నటి సంచలన వ్యాఖ్యలు?

TV Actress sreevani

TV Actress sreevani: బుల్లితెరపై ఎంతో పాపులారిటీ ఉన్న నటీమణులలో శ్రీవాణి ఒకరు. చంద్రముఖి సీరియల్ ద్వారా ఎనలేని గుర్తింపును సంపాదించుకున్న శ్రీ వాణి ప్రేమ వివాహం చేసుకున్నారు. తన భర్త ఈవెంట్ ఆర్గనైజర్ అండ్ మానేజర్ పని చేస్తున్నారు.

  • Share this:
    TV Actress sreevani: బుల్లితెరపై ఎంతో పాపులారిటీ ఉన్న నటీమణులలో శ్రీవాణి ఒకరు. చంద్రముఖి సీరియల్ ద్వారా ఎనలేని గుర్తింపును సంపాదించుకున్న శ్రీ వాణి ప్రేమ వివాహం చేసుకున్నారు. తన భర్త ఈవెంట్ ఆర్గనైజర్ అండ్ మానేజర్ పని చేస్తున్నారు. చంద్రముఖి సీరియల్ ద్వారా ఎనలేని గుర్తింపును సంపాదించుకున్న శ్రీవాణి ప్రస్తుతం పలు యూట్యూబ్ వీడియోల ద్వారా అభిమానులకు మరింత దగ్గరై సందడి చేస్తున్నారు.

    తాజాగా శ్రీవాణి నటుడు సాయికుమార్ హోస్ట్ గా చేస్తున్నటువంటి ఒక కార్యక్రమానికి ఇతర నటీమణులు
    నవీనా యాట, గీతా సౌజన్య, ప్రశాంతిలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నలుగురు కలిసి ఎంతో సరదాగా ఆడుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ వాణి తన వ్యక్తిగత విషయాలను ఈ కార్యక్రమం ద్వారా బయటపెట్టారు.

    ఈ క్రమంలోనే తను పదహారేళ్ళ వయసులో ఉన్నప్పుడు తన భర్త తనపై ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి హైదరాబాద్ లో ప్రేమికుల స్థలమైన దుర్గం చెరువుకి తీసుకెళ్లి తనకు లవ్ ప్రపోస్ చేశారని.. అదేవిధంగా తనపై ఎంత ప్రేమ ఉందో చెబుతూ తన నుదుటిన ముద్దు పెట్టాడని ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయమైన తొలిముద్దు సీక్రెట్ బయట పెట్టారు.



    సాధారణంగా ఇలాంటి విషయాలను ఏ సెలబ్రిటీలు బయటకి చెప్పుకోరు. కానీ శ్రీ వాణి తన చేసిన పనిలో ఏమాత్రం తప్పులేదని భావించి తన వ్యక్తిగత విషయాలను ఈ సందర్భంగా బయటపెట్టారు. అంతేకాకుండా 17 సంవత్సరాలకే తను ప్రేమించిన వ్యక్తితో ఇంటి నుంచి వెళ్లిపోయి పెద్దలకు తెలియకుండా వివాహం కూడా చేసుకున్నారు. ఇలా తను ఇష్టపడిన వాడిని పెళ్లి చేసుకున్న శ్రీ వాణి జీవితం ప్రస్తుతం ఎంతో సుఖంగా సాగిపోతుంది. ప్రస్తుతం శ్రీవాణి పలు యూట్యూబ్ వీడియోలు, పలు సీరియల్స్ ద్వారా అభిమానులను సందడి చేస్తున్నారు.ఇకపోతే శ్రీవాణి దంపతులకు నందిని అనే ఒక కూతురు కూడా ఉన్న సంగతి మనకు తెలిసిందే.
    Published by:Navya Reddy
    First published: