జూనియర్ ఆర్టిస్ట్ చేతిలో మోసపోయిన ప్రముఖ సీరియల్ నటి

సీరియల్స్‌లో పని చేస్తున్నప్పుడు వినీత్ ఆమెకు పరిచయమయ్యాడు అని ఆమె చెప్పింది.

news18-telugu
Updated: November 16, 2019, 3:37 PM IST
జూనియర్ ఆర్టిస్ట్ చేతిలో మోసపోయిన ప్రముఖ సీరియల్ నటి
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
సినీ ఇండస్ట్రీలో చాలామంది ఆడవాళ్లు... అవకాశాల కోసం అనేకమందిని నమ్మి మోసపోతుంటారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హిందీలోకూడా పాపులర్ సీరియల్స్‌లో నటించిన ఓ నటి జూనియర్ ఆర్టిస్ట్ చేతిలో మోసపోయింది.
హిందీ సీరియల్స్ ఆయిన 'కహానీ ఘర్ ఘర్ కీ', 'నచ్ బలియే' వంటి వాటిలో నటించిన ఓ అందాల నటి తనను జూనియర్ ఆర్టిస్ట్ వినీత్ అనే యువకుడు రేప్ చేశాడంటూ మీడియా ముందుకు వచ్చింది.

అక్టోబర్ 13న ముంబయిలోని యమునా నగర్‌లో ఉన్న ఓ హోటల్‌కు వినీత్ ఆమెని రమ్మని చెప్పాడని నటి పేర్కొంది. ఆ తర్వాత ఆమెకు ఇచ్చిన జ్యూస్‌లో డ్రగ్స్ కలిపాడంది. ఆ విసయం తెలియక జ్యూస్ తాగిన తాను కళ్లు తిరుగుతున్నట్లుగా అనిపించడంతో వినీత్ ఏం చెబితే అది చేశానని చెప్పింది. ఆ సమయంలో అతను ఆమెను లొంగదీసుకున్నాడని చెప్పుకొచ్చింది. అయితే తాను గర్భం దాల్చే వరకు వినీత్ ఆమెను రేప్ చేశాడన్న విషయం తెలీలేదని వెల్లడించింది. గర్భవతి కావడంతో పెళ్లి చేసుకోమని వినీత్‌ను కోరితే ముఖం చాటేశాడని వాపోయింది. సీరియల్స్‌లో పని చేస్తున్నప్పుడు వినీత్ ఆమెకు పరిచయమయ్యాడు అని ఆమె చెప్పింది. అయితే ప్రస్తుతం వినీత్ పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని అతని కోసం గాలిస్తున్నారు.First published: November 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...