నా నాన్నను చంపారు.. వాళ్ళను నేను వదలా!

sambhavna-seth (1)

సంభావన తండ్రి ఇటీవలే కోవిడ్‌తో కన్నుమూశారు. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే అంటూ ఆరోపణలు చేసింది. తన తండ్రిని అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారని వాపోయింది.

  • Share this:
    బుల్లితెర నటి సంభావన సేత్‌ డాకర్లపై అగ్రహాం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. సంభావన తండ్రి ఇటీవలే కోవిడ్‌తో కన్నుమూశారు. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే అంటూ ఆరోపణలు చేసింది. తన తండ్రిని అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారని వాపోయింది. ఆక్సిజన్‌ లెవల్స్‌ తక్కువగా ఉన్నప్పటికీ వైద్యులు పట్టించుకోలేదని ఈ కారణంగానే ఆయన చనిపోయాడని నటి మండిపడింది. తన తండ్రి చావుకు కారణమైన వారిని ఎవర్ని వదిలిపెట్టనని హెచ్చరించింది.


    డాక్టర్లు దేవుళ్లు.. కానీ వారిలో కొందరూ రాక్షసులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళే తన తండ్రిని చంపేశారు. నా తండ్రి మరణం నా జీవితంలో చికటిరోజు. ఇప్పుడు నేను దైర్యంగా ముందుకు వెళుతాను. తండ్రి నేర్పిన మార్గంలోనే న్యాయం కోసం పోరాడుతాను. ఈ పోరాటంలో నేను విజయం సాధించకపోయిన కొందరిని మాత్రం తప్పకుండా బయటకు లాగుతా.. వారి నిజ స్వరూపం బయటపెడుతా... నా తండ్రి మరణించిన జైపూర్‌ గోల్డెన్‌ ఆస్పత్రికి లీగల్‌ నోటీసులు పంపించా... మనలో చాలామంది ఈ కష్టాన్ని అనుభవించి ఉంటారు. మీకు ఎదురైన పరిస్థితుల కారణాల మీరు ఏం చేయలేకపోవచ్చు. నా పోరాటానికి అందరూ మద్దతు తెలపండి" అని తెలిపింది.
    Published by:Rekulapally Saichand
    First published: