నాచురల్ స్టార్ నాని హీరోగా.. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ (Nani Tuck Jagadish)అనే యాక్షన్ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అయితే మొదటి నుంచీ మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా పోస్టర్స్ అండ్ ఫస్ట్ లుక్ టీజర్స్‌ను బట్టి చూస్తే మాత్రం ఓ క్లాస్ అండ్ పవర్ ప్యాక్డ్ గా ఉందని చెప్పొచ్చు. ఈ సినిమా ఏప్రిల్ 23న విడుదలకావల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత సినిమా విడుదల అవుతుందని చిత్రబృదం ప్రకటించింది. అయితే ఈ చిత్రం ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్‌ని స్కిప్ చేసి నేరుగా ఓటిటి లో రిలీజ్ చేస్తున్నారు. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ మాస్ ఫామిలీ ఎంటర్టైనర్ అటు టిక్కెట్ రేట్స్‌తో కరోనా పరిస్థితుల నడుమా ఓటీటీ రిలీజ్ (Tuck Jagadish on Amazon Prime) కు మొగ్గు చూపింది. అయితే ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న విషయం ఈరోజు క్లారిటీ రానుంది. దీనికి సంబంధించి నాని ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన చేయనున్నారు. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమా ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 10 అర్ధ రాత్రి 12 గంటలకి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా.. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటించారు.
ఇక ఈ సినిమాకు అమెజాన్ ప్రైమ్ అదిరిపోయే ఆఫర్‌ను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓటీటీ విడదల కోసం ఏకంగా రూ. 45 కోట్లను అమెజాన్ ప్రైమ్ చెల్లించినట్లు సమాచారం. సన్ షైన్ స్క్రీన్స్ సంస్థ నిర్మిస్తున్నారు. నాని నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. నాని ట్యాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో 27వ సినిమాగా శ్యామ్ సింగరాయ్’ (Shyam Singha Roy)సినిమా చేస్తున్నారు. ఈ మూవీకి వెంకట్ బోయినపల్లి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. సాయి పల్లవి, 'ఉప్పెన' ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్లుగా (Sai pallavi,kriti shetty) నటిస్తున్నారు. ఈ సినిమాలో నాని 70 ఏళ్ల వయసు మళ్లిన వ్యక్తిగా ప్రయోగాత్మక పాత్రలో కనిపించబోతున్నాడట. పిరియాడిక్ మూవీగా రూపొందనున్న ఈ చిత్రం మొత్తం కోల్‌కతా నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ మూవీకి మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలతో పాటు నాని 'బ్రోచే వారెవరురా' ఫేమ్ వివేక్ ఆత్రేయతో 'అంటే.. సుందరానికి..' అనే ఓ అడల్ట్ కామెడీ ఎంటర్టైనర్ని చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ సినిమాలతో పాటు నాని మరో సినిమాను లైన్లో పెట్టారు. ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నారట. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా తెలంగాణ నేపధ్యంలో తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో నాని తెలంగాణ యువకుడిగా కనిపించనున్నారట. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon prime, Hero nani, Tuck Jagadish