• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • TUCK JAGADISH POSTPONED AND LOVE STORY RELEASING ON THE SAME DATE MHN

Naga Chaitanya - Natyral Star Nani: నాగచైతన్య కోసం వెనక్కి వెళుతున్న నాని..!

Naga Chaitanya -  Natyral Star Nani: నాగచైతన్య కోసం వెనక్కి వెళుతున్న నాని..!

Tuck Jagadish postponed and Love Story releasing on the same date

Naga Chaitanya - Natyral Star Nani: నేచురల్‌ స్టార్‌ నాని నటిస్తున్న టక్‌ జగదీష్‌ సినిమా, నాగచైతన్య హీరోగా చేసిన లవ్‌స్టోరి సినిమాను ఏప్రిల్‌ 16ననే విడుదల చేయాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో రెండు సినిమాల మధ్య అండర్‌స్టాండింగ్‌ కుదిరింది

  • Share this:
    ఓ రేంజ్‌ స్టార్‌ డమ్‌తో మూడో స్టేజ్‌ స్టార్‌ హీరోలుగా రాణిస్తోన్న లిస్టులో అక్కినేని నాగచైతన్య, నేచురల్‌ స్టార్‌ నాని ఉంటారు. ఈ ఇద్దరు స్టార్స్‌ తమ మార్కెట్‌ పరిధిని నెక్ట్స్‌ రేంజ్‌కు తీసుకెళ్లడానికి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తమదైన మార్కును క్రియేట్‌ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. తమ ప్రయత్నాల్లో భాగంగా అక్కినేని నట వారసుడు నాగచైతన్య హీరోగా చేసిన సినిమా లవ్‌స్టోరి. ఈ సినిమాను ఏప్రిల్‌ 16న విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు నిర్ణయించారు. అదే రోజున నేచురల్‌ స్టార్‌ నాని తన లేటెస్ట్‌ మూవీ 'టక్‌ జగదీష్‌'ను విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇద్దరికీ ఉన్న ఇమేజ్‌ కారణంగా ఒకేరోజున వీరి సినిమాలు విడుదలైతే, బాక్సాఫీస్‌ వద్ద నిర్మాతలకు ఇబ్బందులు తప్పవు. దీంతో రెండు సినిమాలకు సంబంధించిన నిర్మాతలు డిస్కస్‌ చేసుకున్నారట.

    చర్చల అనంతరం నేచురల్‌ స్టార్‌ నాని టక్‌ జగదీష్‌ చిత్రాన్ని ఏప్రిల్‌ 23న విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారట. టక్‌ జగదీష్‌ చిత్రాన్ని శివ నిర్వాణ డైరెక్ట్‌ చేశారు. నిన్ను కోరి సినిమా తర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రమిది. అలాగే నాగచైతన్య లవ్‌స్టోరి సినిమాను శేఖర్‌ కమ్ముల తెరకెక్కించాడు. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటించింది. ఫిదా తర్వాత శేఖర్‌ కమ్ముల డైరెక్ట్‌ చేస్తున్న సినిమా కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

    ప్రస్తుతం నాగచైతన్య థాంక్యూ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు విక్రమ్‌ కుమార్‌ దర్శకుడు. దిల్‌రాజు నిర్మాత. అలాగే నాని శ్యామ్‌ సింగరాయ్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఈ హీరోలిద్దరూ వారి సినిమాలను పూర్తి చేయడంలో బిజీగా ఉన్నారు.
    Published by:Anil
    First published:

    అగ్ర కథనాలు