నాచురల్ స్టార్ నాని హీరోగా.. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ (Nani Tuck Jagadish)అనే యాక్షన్ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో డైరెక్ట్‌గా రిలీజ్ చేస్తున్నారు. అందులో భాగంగా ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించింది. ఈ వినాయక చవితి సందర్బంగా నేచరల్ స్టార్ నాని తన అభిమానులను అలరించబోన్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదల చేసింది. టక్ జగదీష్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 10న స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించారు. ఈ చిత్రంలో నాని, రీతూ వర్మ, జగపతి బాబు (Jagapathi Babu) ప్రధాన పాత్రల్లో నటించగా ఇతర కీలక పాత్రల్లో ఐశ్వర్య రాజేష్, (Aishwarya rajesh) తిరువీర్, వైష్ణవి చైతన్య, దేవదర్శిని, డానియల్ బాలాజీ కనిపిస్తారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో 240 దేశాలు, ప్రాదేశిక ప్రాంతాల్లో సెప్టెంబర్ 10, 2021నుంచి టక్ జగదీష్ ప్రసారం కానుంది.
అయితే మొదట అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 23న విడుదలకావల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత సినిమా విడుదల అవుతుందని చిత్రబృదం ప్రకటించింది. అయితే ఈ చిత్రం ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్‌ని స్కిప్ చేసి నేరుగా ఓటిటి లో రిలీజ్ చేస్తున్నారు. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ మాస్ ఫామిలీ ఎంటర్టైనర్ అటు టిక్కెట్ రేట్స్‌తో కరోనా పరిస్థితుల నడుమా ఓటీటీ రిలీజ్ (Tuck Jagadish on Amazon Prime) కు మొగ్గు చూపింది. ఈ సినిమాకు అమెజాన్ ప్రైమ్ అదిరిపోయే ఆఫర్‌ను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓటీటీ విడదల కోసం ఏకంగా రూ. 45 కోట్లను అమెజాన్ ప్రైమ్ చెల్లించినట్లు సమాచారం.
we are ready with our ?️ to welcome @NameIsNani
Meet #TuckJagadishOnPrime, Sept 10@riturv @aishu_dil @IamJagguBhai @DanielBalaje @Shine_Screens @ShivaNirvana @sahugarapati7 @harish_peddi @MusicThaman @adityamusic @sahisuresh @praveenpudi @IamThiruveeR @GopiSundarOffl pic.twitter.com/NLL0DMYJf1
— amazon prime video IN (@PrimeVideoIN) August 27, 2021
ఇక నాని నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. నాని ట్యాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో 27వ సినిమాగా శ్యామ్ సింగరాయ్’ (Shyam Singha Roy)సినిమా చేస్తున్నారు. ఈ మూవీకి వెంకట్ బోయినపల్లి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. సాయి పల్లవి, 'ఉప్పెన' ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్‌లుగా (Sai pallavi ) (kriti shetty) నటిస్తున్నారు. ఈ సినిమాలో నాని 70 ఏళ్ల వయసు మళ్లిన వ్యక్తిగా కనిపించబోతున్నాడట. పిరియాడిక్ మూవీగా రూపొందనున్న ఈ చిత్రం మొత్తం కోల్‌కతా నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ మూవీకి మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలతో పాటు నాని 'బ్రోచే వారెవరురా' ఫేమ్ వివేక్ ఆత్రేయతో 'అంటే.. సుందరానికి..' అనే ఓ అడల్ట్ కామెడీ ఎంటర్‌టైనర్‌ని చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon prime, Hero nani, Tollywood news