Tuck Jagadish Trailer Talk : నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ ఎపుడో ఏప్రిల్ చివరి వారంలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం థియేటర్స్‌లో సినిమాలు విడుదలవుతున్న.. నాని మాత్రం తన లేటెస్ట్ మూవీ ‘టక్ జగదీష్’ సినిమాను థియేటర్స్‌లో కాకుండా ఓటీటీ వేదికగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేస్తున్నారు. దీని కోసం ఈ సినిమా నిర్మాతలకు థియేట్రికల్ బిజినెస్ కంటే ఎక్కువ మొత్తంలో అమెజాన్ ప్రైమ్ ఆఫర్ చేయడంతో ఈ సినిమా నిర్మాతలు ఓటీటీకే ఓటు వేసారు. ఈ నెల 10న ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసారు.
తాజాగా విడుదలైన ట్రైలర్‌లో ఓ ఊరి కోసం కుటుంబం.. ఆ కుంటుబం కోసం ఒక్కడు. ఊరు బాగుంటే.. కుటుంబ బాగుంటుంది. కుటుంబం బాగుంటే.. మనిషి బాగుంటాడు. అలా సమాజం మొత్తం బాగుంటుందనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. ఈ సినిమాలో నాని, జగపతి బాబు అన్నదమ్ముళ్లుగా నటించారు. ఈ సినిమాలో డైలాగులు కూడా ఆలోచింప చేస్తున్నాయి. నా కుటుంబం ఓడిపోతే నేను ఓడిపోయినట్టే. అంతేకాదు విలన్‌గా ‘భూ కక్ష్యలు లేని భూదేవి పురం చూడాలనేది మా నాన్న కోరిక. ఇపుడు నా బాధ్యత అంటూ నాని చెప్పే డైలాగు బాగుంది. ముఖ్యంగా ఓ ఊరి కోసం ఓ యువకుడు ఏం చేసాడన్నదే ‘టక్ జగదీష్’ స్టోరీలా కనిపిస్తోంది.
Meet #TuckJagadishOnPrime, Sept 10 @PrimeVideoIN
Trailer https://t.co/RF8EN4fXPt@NameIsNani @riturv @aishu_dil @IamJagguBhai @IamThiruveeR @DanielBalaje @ShivaNirvana @MusicThaman @GopiSundarOffl @sahisuresh @praveenpudi @sahugarapati7 @harish_peddi @Shine_Screens @adityamusic pic.twitter.com/DCmGuXZA7k
— BA Raju's Team (@baraju_SuperHit) September 1, 2021
ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించారు. ఈ చిత్రంలో నాని, రీతూ వర్మ, జగపతి బాబు (Jagapathi Babu) ప్రధాన పాత్రల్లో నటించగా ఇతర కీలక పాత్రల్లో ఐశ్వర్య రాజేష్, (Aishwarya rajesh) తిరువీర్, వైష్ణవి చైతన్య, దేవదర్శిని, డానియల్ బాలాజీ కనిపిస్తారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో 240 దేశాలు, ప్రాదేశిక ప్రాంతాల్లో సెప్టెంబర్ 10, 2021నుంచి టక్ జగదీష్ ప్రసారం కానుంది.
అయితే మొదట అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 23న విడుదలకావల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత సినిమా విడుదల అవుతుందని చిత్రబృదం ప్రకటించింది.
అయితే ఈ చిత్రం ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్‌ని స్కిప్ చేసి నేరుగా ఓటిటి లో రిలీజ్ చేస్తున్నారు. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ మాస్ ఫామిలీ ఎంటర్టైనర్ అటు టిక్కెట్ రేట్స్‌తో కరోనా పరిస్థితుల నడుమా ఓటీటీ రిలీజ్ (Tuck Jagadish on Amazon Prime) కు మొగ్గు చూపింది. ఈ సినిమాకు అమెజాన్ ప్రైమ్ అదిరిపోయే ఆఫర్‌ను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓటీటీ విడదల కోసం ఏకంగా రూ. 45 కోట్లను అమెజాన్ ప్రైమ్ చెల్లించినట్లు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon prime, Nani, Tollywood, Tuck Jagadish