హోమ్ /వార్తలు /సినిమా /

Tuck Jagadish : అమెజాన్ ప్రైమ్‌లో అదరగొడుతోన్న నాని టక్ జగదీష్..

Tuck Jagadish : అమెజాన్ ప్రైమ్‌లో అదరగొడుతోన్న నాని టక్ జగదీష్..

Tuck Jagadish Photo : Twitter

Tuck Jagadish Photo : Twitter

Tuck Jagadish : నాచురల్ స్టార్ నాని హీరోగా రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్‌లు హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ డ్రామా టక్ జగదీష్(Nani Tuck Jagadish) డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై సాలిడ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

నాచురల్ స్టార్ (Nani) నాని హీరోగా రీతూ వర్మ (Ritu Varma), ఐశ్వర్య రాజేష్‌లు హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ డ్రామా టక్ జగదీష్(Nani Tuck Jagadish). శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదట థియేటర్ రిలీజ్ కోసం ప్రయత్నించిన పలు కారణాల వలన డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ఎంచుకుంది. అందులో భాగంగా టక్ జగదీష్ (Amazon prime) ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 10న రిలీజ్ అయ్యింది. మొదట్లో ఈ సినిమా గురించి కాస్తా నెగిటివ్ టాక్ వచ్చిన ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. అందులో భాగంగా “టక్ జగదీష్” (Tuck Jagadish) సాలిడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. టక్ జగదీష్ చిత్రం ప్రైమ్ వీడియోలో తెలుగు భాషకు సంబంధించిన వరకు అత్యధికంగా చూసిన సినిమాగా సరికొత్త రికార్డు సెట్ చేసిందని అంటున్నారు.

భారీ వ్యూవర్ షిప్స్ తో టక్ జగదీష్ ప్రైమ్ వీడియోలో టాప్ ప్లేస్‌లో చేరుకుందట. దీంతో చిత్రబృందం సంతోషంగా ఉందని తెలుస్తోంది. ఓటీటీ విడదల కోసం ఏకంగా రూ. 45 కోట్లను అమెజాన్ ప్రైమ్ చెల్లించినట్లు సమాచారం. ఇక్కడ విశేషం ఏమంటే.. నాని గత సినిమా వి కూడా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అనుకున్నంతగా ప్రేక్షకులను అలరించలేక పోయింది.

హీరోయిన్ మీనా భర్త ఎవరు ఎలా ఉంటారో తెలుసా...

ఇక నాని నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. నాని ట్యాక్సీవాలా' ఫేమ్‌ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో 27వ సినిమాగా శ్యామ్ సింగరాయ్’  (Shyam Singha Roy)సినిమా చేస్తున్నారు. ఈ మూవీకి వెంకట్‌ బోయినపల్లి నిర్మాతగా వ్యవహరించనున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదిని చిత్రబృందం ప్రకటించనుంది.

Happy Birthday Meena : మీనా తెలుగులో నటించిన మొదటి సినిమా ఏంటో తెలుసా...

ఈ సినిమాలో సాయి పల్లవి, 'ఉప్పెన' ఫేమ్‌ కృతిశెట్టి హీరోయిన్‌లుగా (Sai pallavi ) (kriti shetty)  నటిస్తున్నారు. శ్యామ్ సింగ రాయ్‌‌లో నాని 70 ఏళ్ల వయసు మళ్లిన వ్యక్తిగా కనిపించబోతున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మంచి ఆదరణ పొందింది. పిరియాడిక్‌ మూవీగా రూపొందనున్న ఈ చిత్రం మొత్తం కోల్‌కతా నేపథ్యంలో తెరకెక్కినట్లు సమాచారం. ఈ మూవీకి మిక్కీ జె.మేయర్‌ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఈ సినిమాలతో పాటు నాని 'బ్రోచే వారెవరురా' ఫేమ్‌ వివేక్‌ ఆత్రేయతో 'అంటే.. సుందరానికి..' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అడల్ట్‌ కామెడీ జానర్‌లో వస్తోందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.  అంటే.. సుందరానికి..లో నానికి జంటగా మలయాళీ నటి నజ్రియా నజీమ్‌ నటిస్తున్నారు.  సంగీతం వివేక్ సాగర్ అందిస్తున్నారు.

First published:

Tags: Tollywood news, Tuck Jagadish

ఉత్తమ కథలు