Home /News /movies /

TSRTC SENT NOTICE TO TOLLYWOOD ICON STAR ALLU ARJUN AND RAPIDO MANAGEMENT PK

Allu Arjun - TSRTC Notice: వివాదంలో అల్లు అర్జున్ రాపిడో యాడ్.. నోటీసులు పంపించిన TSRTC..

అల్లు అర్జున్ (Allu Arjun)

అల్లు అర్జున్ (Allu Arjun)

Allu Arjun - TSRTC Notice: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun - TSRTC Notice) అనుకోని వివాదంలో ఇరుక్కున్నాడు. ఈయన నటించిన ఓ యాడ్ ఇప్పుడు టిఎస్ఆర్‌టీసి సంస్థకు కోపం తెప్పించింది. ఆ సంస్థ ఎండి సజ్జనార్ దీనిపై సీరియస్ అయ్యారు. ఆర్టీసి ప్రతిష్టను దిగజార్చేలా ఈ యాడ్ ఉందని ఆయన తెలిపాడు.

ఇంకా చదవండి ...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనుకోని వివాదంలో ఇరుక్కున్నాడు. ఈయన నటించిన ఓ యాడ్ ఇప్పుడు టిఎస్ఆర్‌టీసి సంస్థకు కోపం తెప్పించింది. ఆ సంస్థ ఎండి సజ్జనార్ దీనిపై సీరియస్ అయ్యారు. ఆర్టీసి ప్రతిష్టను దిగజార్చేలా ఈ యాడ్ ఉందని.. అందుకే దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. అసలు విషయం ఏంటంటే ఈ మధ్యే అల్లు అర్జున్ రాపిడో కమర్షియల్ యాడ్‌లో నటించాడు. అందులో ఆయన టిఫిన్ సెంటర్ పెట్టుకుని మసాలా దోశలు వేస్తూ.. ఆర్టీసి బస్సులపై సెటైర్లు వేస్తాడు. బస్సు ఎక్కితే ఒళ్ళంతా నుజ్జు నుజ్జు అయిపోతుందనే అర్థం వచ్చేలా మాట్లాడతాడు. అందుకే అనవసరంగా ఆ బస్ ఎక్కి ఒళ్ళు హూనం చేసుకునే కంటే హాయిగా రాపిడో బుక్ చేసుకుని.. చొక్కా నలక్కుంగా.. చవగ్గా.. తక్కువగా మీకు కావాల్సిన చోటికి వెళ్లిపోండి అంటూ చెప్తాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ యాడ్ డైరెక్ట్ చేసాడు. ఈ మధ్యే విడుదలైన యాడ్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే దీనిపై ఇప్పుడు TSRTC సీరియస్ అయింది.

ఇలాంటి యాడ్స్ చేయడం అంటే ఆర్టీసి ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడమే అని వాళ్లు నోటీసులు పంపించారు. అందులో నటించిన అల్లు అర్జున్.. రాపిడో సంస్థకు నోటీసులు పంపించినట్లు తెలిపాడు ఆర్టీసీ ఎండి సజ్జనార్.

Chiranjeevi: చిరంజీవి ప్లానింగ్ మామూలుగా లేదుగా.. మెగాస్టార్ జోరుకు అంతా సలాం..!



ఈ యాడ్‌పై సంస్థ ఉద్యోగులు, ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని తెలిపారు ఆయన. రాపిడో సంస్థను ఆర్టీసీ సేవలతో పోల్చి చూపించడమే కాకుండా.. సంస్థ పరువు తీసేలా తక్కువ చేసి చూపిస్తున్నారని ఆయన తెలిపాడు. మెరుగైన సమాజం కోసం ప్రభుత్వ రవాణాను ప్రోత్సహించే విధంగా సినిమా వాళ్లు పని చేయాలి కానీ.. ఇలా వాటి ప్రతిష్టకు భంగం వాటిల్లే ప్రకటనల్లో నటించకూడదని సజ్జనార్ తెలిపారు. మరి దీనిపై అల్లు అర్జున్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Allu Arjun, Telugu Cinema, Tollywood, Tsrtc

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు