హోమ్ /వార్తలు /సినిమా /

అందరిలా బతకడం నా వల్ల కాదు.. పూజా హెగ్డే

అందరిలా బతకడం నా వల్ల కాదు.. పూజా హెగ్డే

Instagram.com/hegdepooja

Instagram.com/hegdepooja

పూజా హెగ్డే..  వరుణ్ తేజ్ సరసన 'ముకుంద' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన విషయం తెలిసిందే.

పూజా హెగ్డే..  వరుణ్ తేజ్ సరసన 'ముకుంద' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలుల అందిపుచ్చుకుంటూ  ప్రస్తుతం తెలుగులో చాలా బీజీగా ఉన్న హీరోయిన్‌లో ఒకరుగా ఉన్నారు. ఈ భామ టాప్ హీరోల అందరితోను ఆడిపాడింది.  అల్లు అర్జున్ సరసన 'డీజే' లోహాట్‌గా అదరగొట్టిన ఈ భామ.. ఎన్టీఆర్‌తో 'అరవింద సమేత'లో క్యూట్‌గా మైమరిపించింది.  తర్వాత ఇటీవలే మహేష్‌ బాబుతో కలసి ‘మహర్షి’లో చేసి మంచి హిట్ అందుకుంది.  తాజాగా  వరుణ్‌తో మరో సారి ఆడిపాడుతోంది. గద్దలకొండ గణేష్‌గా వస్తోన్న ఈ సినిమాలో అలనాటి శ్రీదేవి హిట్ సాంగ్ 'ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మో'  అనే పాటలో అదరగొట్టనుంది ఈ జంట. ఈ సినిమా ఈరోజు విడుదల కానుంది.

View this post on Instagram

Innocent but feisty...SRIDEVI...3 days to go for Valmiki..... 📽🎞 #valmiki #Sridevi #lovemyjob


A post shared by Pooja Hegde (@hegdepooja) onవరుస హిట్లతో ఊపు మీద ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల మీడియతో మాట్లాడుతూ.. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేందుకు నేనెప్పుడూ ముందే ఉంటానని.. జీవితంలో సాహసాలు చేయడం చాలా అవసరం అని చెబుతూ.. అవే మనల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెడతాయంటోంది. జీవితాన్ని కంఫర్టబుల్‌గా బతకడంలో ఆనందం ఉందనుకుంటారు. అందులో భాగంగానే.. ఒకే రకమైన లైఫ్‌కు అలవాటు పడిపోతుంటారు. అలా బతకడంలో తప్పు లేదు.. కానీ మనకంటూ ఓ గుర్తింపు రావాలంటే మాత్రం.. పదిమందికంటే భిన్నంగా ఆలోచించాల్సిందే అంటోంది.  మనం కొత్తగా ప్రయత్నిస్తే.. ఎదురుదెబ్బలు తగులుతాయి. వాటిని తట్టుకుని నిలబడాలని చెబుతోంది. పూజా ఇంకా మాట్లాడుతూ.. సినిమాలు మనకెందుకు.. అనుకుంటే చాలామంది అమ్మాయిల్లానే నేనూ చదువు ,ఉద్యోగం అంటూ మిగిలిపోయేదాన్నని... కాని ‘ఓసారి ట్రై చేసి చూద్దాం’ అని గట్టిగా అనుకున్నాను అంతే.. అయితే.. ఈ ప్రయాణంలో మొదట కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ చివరికి మాత్రం నా గమ్యాన్ని చేరుకున్నానంటోంది.

First published:

Tags: Pooja Hegde, Telugu Movie News

ఉత్తమ కథలు