‘మహానటి’ సినిమాపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసలు..

66వ జాతీయ అవార్డుల్లో సావిత్రి జీవిత కథపై నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘మహానటి’ సత్తా చాటింది. తాజాగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా మహానటి చిత్ర యూనిట్‌తో పాటు కీర్తి సురేష్‌ను అభినందించారు.

news18-telugu
Updated: August 10, 2019, 6:31 PM IST
‘మహానటి’ సినిమాపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసలు..
మహానటి ప్రశంసలతో ముంచెత్తిన కేటీఆర్ (ఫైల్ ఫోటో)
  • Share this:
66వ జాతీయ అవార్డుల్లో సావిత్రి జీవిత కథపై నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘మహానటి’ సత్తా చాటింది. ఈ సినిమా ఉత్తమ ప్రాంతీయ తెలుగు చలన చిత్రం అవార్డుతో పాటు ఉత్తమ నటి.. ఉత్తమ కాస్ట్యూమ్స్ విభాగాల్లో అవార్డు గెలుచుకుంది. ముఖ్యంగా కీర్తి సురేష్..మహానటి సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసిందా అనే రేంజ్‌లో నటించి మెప్పించింది. ఒకవైపు ‘మహానటి’ సినిమాకు ఉత్తమ ప్రాంతీయ భాష చలనచిత్రం అవార్డుతో పాటు ఉత్తమనటి అవార్డు రావడంపై చిరంజీవి,పవన్ కళ్యాణ్, రాజమౌళి, జాన్వీ కపూర్ సహా పలువురు సినీ ప్రముఖులు మహానటి చిత్ర యూనిట్‌ను అభినందించారు. తాజాగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా మహానటి చిత్ర యూనిట్‌తో పాటు కీర్తి సురేష్‌ను అభినందించారు. అంతేకాదు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వారిని జాతీయ చలన చిత్ర అవార్డుల కమిటీ గుర్తించినందకు అభినందలు తెలియజేసారు.


మరోవైపు చి.ల.సౌ సినిమాకు ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు అందుకున్న రాహుల్ రవీంద్రన్‌తో పాటు రంగస్థలం చిత్ర యూనిట్‌తో పాటు ‘అ’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన  నానిని  శుభాకాంక్షలు తెలియజేసారు కేటీఆర్. తెలుగులో శారద (నిమజ్జనం), అర్చన (దాసి),విజయశాంతి (కర్తవ్యం)తర్వాత జాతీయ స్థాయిలో తెలుగులో అవార్డు అందుకున్న నాల్గో నటిగా కీర్తి సురేష్ నిలిచింది.First published: August 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>