ఈ సినిమా అద్బుతం...ఆ చిత్రాన్ని మెచ్చుకున్న కేటీఆర్

టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమయం దొరికినప్పుడల్లా సినిమాలు చూస్తుంటార‌ు అంతేకాదు నచ్చితే..వాటీని ప్రశంసిస్తారు కూడా, అందులో భాగంగా ఆయన తాజగా మరో సినిమాను మెచ్చుకున్నారు.

news18-telugu
Updated: February 26, 2019, 8:24 AM IST
ఈ సినిమా అద్బుతం...ఆ చిత్రాన్ని మెచ్చుకున్న కేటీఆర్
కేటీఆర్ Photo: KTR facebook
  • Share this:
టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమయం దొరికినప్పుడల్లా సినిమాలు చూస్తుంటార‌ు అంతేకాదు నచ్చితే..వాటీని ప్రశంసిస్తారు కూడా.. ఆయన ఇంతకు ముందు పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, బాహుబలి సినిమాలను మెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే.. కొన్ని రోజుల నుండి.. ఎన్నిక‌ల‌తో బిజీగా గడిపిన కేటీఆర్.. తాజాగా ఓ సినిమా గురించి ట్వీట్ చేశారు. అదే కేజీఎఫ్. ఈ సినిమా..ద‌క్షిణాది సినిమాల్లో బాహుబ‌లి త‌ర్వాత ఆ స్థాయిలో భారీ బ‌డ్జెట్‌తో నిర్మిత‌మై అంతే విధంగా.. ఘ‌న విజ‌యం సాధించింది. కన్నడ స్టార్ య‌ష్ న‌టించిన ఈ సినిమాను కన్నడతోపాటు తెలుగు, తమిళం‌, మలయాళం, హిందీ భాషల్లోనూ విడుదల చేశారు.

KGF సినిమా పోస్టర్
KGF సినిమా పోస్టర్


దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ.250 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.  అయితే తాజాగా ఆ సినిమా చూసిన కేటీఆర్  ట్విట‌ర్ హ్యండిల్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆయన మాటల్లో ‘నేను కాస్త ఆలస్యంగానే మాట్లాడుతుండొచ్చు.. అయితే ఎట్టకేలకూ ‘కేజీఎఫ్‌’ సినిమా చూశా. ఇది ఓ అద్భుతమైన సినిమా. సాంకేతికత పరంగా బ్రిలియంట్‌గా తీశారు. రాక్‌స్టార్‌ యశ్‌ తెరపై కనిపించిన విధానం నాకెంతో నచ్చింది’ అని మెచ్చుకున్నారు.


దీపికా పదుకొనే లేటెస్ట్ ఫోటోస్
First published: February 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>