హోమ్ /వార్తలు /సినిమా /

సాహో సినిమాకు కేటీఆర్ ప్రశంస...టెక్నికల్ అద్భుతం అంటూ కితాబు...

సాహో సినిమాకు కేటీఆర్ ప్రశంస...టెక్నికల్ అద్భుతం అంటూ కితాబు...

కేటీఆర్, ప్రభాస్

కేటీఆర్, ప్రభాస్

సాహో సినిమా టెక్నికల్ గా చాలా బ్రిలియంట్ గా ఉందని, మన దేశ దర్శకుల రేంజ్ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిందని కేటీఆర్ తన ట్విట్టర్ వేదికగా సాహో చిత్ర యూనిట్ ను ప్రశంసించారు.

    ప్రపంచ వ్యాప్తంగా విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సినిమా సాహోపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించాడు. సాహో సినిమా టెక్నికల్ గా చాలా బ్రిలియంట్ గా ఉందని, మన దేశ దర్శకుల రేంజ్ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిందని కేటీఆర్ తన ట్విట్టర్ వేదికగా సాహో చిత్ర యూనిట్ ను ప్రశంసించారు. అలాగే అడవిశేష్ నటించిన ఎవరు సినిమా సైతం అద్భుతంగా ఉందని స్క్రీన్ ప్లే చాలా బాగుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే బాహుబలి సినిమా తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై ప్రభాస్ సాహో అంటూ సందడి చేసాడు. ఈ సినిమా ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీసు వద్ద ప్రభాస్ స్టామినాను నిలబెట్టింది.

    Published by:Krishna Adithya
    First published:

    Tags: KTR, Prabhas saaho

    ఉత్తమ కథలు