Home /News /movies /

TRP RATINGS WAR BETWEEN JABARDASTH COMEDY SHOW AND ADIRINDI SHOWS PK

జబర్దస్త్ Vs అదిరింది.. రేటింగ్స్ వార్ మామూలుగా లేదుగా..

నాగబాబు రోజా ఫైల్ ఫోటోస్ (Naga Babu Roja)

నాగబాబు రోజా ఫైల్ ఫోటోస్ (Naga Babu Roja)

Jabardasth Vs Adirindi: లాక్‌డౌన్ తర్వాత మొదలైన ఎపిసోడ్స్‌లో అదిరింది, జబర్దస్త్ అదిరిపోయే కంటెంట్ అందిస్తున్నాయి. ఈ రెండూ కూడా కామెడీ పరంగా దూసుకుపోతున్నాయి.

విషయంలో కూడా ఇదే జరిగింది. సంస్థ నచ్చలేదు ఆయన మారిపోయాడు. కానీ నాగబాబు వెళ్లినంత మాత్రానా రేటింగ్స్ పడిపోతాయా అంటే మాత్రం లేదనే సమాధానమే వస్తుంది. కచ్చితంగా నాగబాబు వెళ్లిన తర్వాత జబర్దస్త్ కామెడీ షో కొన్ని వారాలు ఇబ్బంది పడిన మాట వాస్తవమే అయినా కూడా చాలా త్వరగా పుంజుకుంది. ఇప్పుడు కూడా రేటింగ్స్ అద్భుతంగా వస్తున్నాయి.

జబర్దస్త్ కామెడీ షో (jabardasth Comedy show)
జబర్దస్త్ కామెడీ షో (jabardasth Comedy show)


నాగబాబు వెళ్లిపోయిన తర్వాత కూడా టిఆర్పీ రేటింగ్స్‌‌లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఎంత కాదనుకున్నా నాగబాబుకు, జబర్దస్త్ కామెడీ షోకు విడదీయరాని అనుబంధం ఉంది. అసలు ఈయన కెరీర్ మళ్లీ రెక్కలు తొడిగిందే ఈ కామెడీ షో నుంచి. అప్పట్లో ఆరెంజ్ సినిమా తర్వాత నాగబాబు కెరీర్ పూర్తిగా డైలమాలో పడిపోయింది. ఓ సమయంలో అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకుందామనుకున్నాడు నాగబాబు.

నాగబాబు (Twitter/Nagababu)
నాగబాబు (Twitter/nagababu)


అలాంటి సమయంలో ఈయన కెరీర్‌కు మళ్లీ ఊపిరి ఊదింది జబర్దస్త్ కామెడీ షో. అలాంటి షోను వదిలేసి వెళ్లిపోయాడు ఈయన. మంచి పారితోషికం వచ్చినపుడు తప్పేం లేదనే వాళ్లు కూడా ఉన్నారు. కానీ లైఫ్ ఇచ్చిన షోను వదిలి వెళ్లే ముందు ఓసారి ఆలోచించుకుని ఉంటే బాగుండేదని నాగబాబుకు సలహాలు కూడా ఇచ్చారు. కానీ ఆయన మాత్రం కాదనుకుని వెళ్లిపోయాడు. వెళ్లిన తర్వాత కూడా జబర్దస్త్ అలాగే ఉంది కానీ ఆయన వెళ్లిన షో మాత్రం అంతగా సత్తా చూపించడం లేదనే వార్తలు వస్తున్నాయి.

జబర్దస్త్ కామెడీ షో... (Jabardasth Nagababu)
జబర్దస్త్ కామెడీ షో... (Jabardasth Nagababu)


అదిరింది అంటూ జీ తెలుగులో మరో షో మొదలుపెట్టాడు. అయితే జబర్దస్త్ కామెడీ షోకు పోటీగా వచ్చినా కూడా ఇప్పటి వరకు అది ప్రభావం చూపించింది మాత్రం తక్కువే. మరోవైపు నాగబాబు లేకపోయినా కూడా జబర్దస్త్ మాత్రం దుమ్ము దులిపేస్తూనే ఉంది. రేటింగ్స్‌లో టాప్‌లోనే ఉంది ఈ షో. దానికితోడు అదిరింది షోకు రేటింగ్స్ ఊహించినంతగా రావడం లేదనే ప్రచారం జరుగుతుంది. ఓ కొత్త కార్యక్రమం పరంగా చూసుకుంటే మాత్రం దీనికి మంచి రేటింగ్స్ వస్తున్నా కూడా ఊహించినంత మాత్రం రావడం లేదు.

జబర్దస్త్ కామెడీ షో... (Jabardasth Nagababu)
జబర్దస్త్ కామెడీ షో... (Jabardasth Nagababu)


దీనిపై జీ సంస్థ కూడా తర్జనభర్జన పడుతుంది. టీమ్స్ బాగానే ఉన్నా కూడా ఎక్కడో రేటింగ్స్ విషయంలో మాత్రం తేడా కొడుతుంది. ఈ సమయంలో జబర్దస్త్ వైపు నాగబాబు ఆలోచించినా కూడా మల్లెమాల మాత్రం నో ఎంట్రీ బోర్డ్ పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. దానికి కారణం కూడా లేకపోలేదు.. వెళ్లేప్పుడు మామూలుగా వెళ్లిపోయుంటే అసలు సమస్యే ఉండేది కాదు కానీ మల్లెమాలపై చాలా విమర్శలు చేసాడు నాగబాబు. ఏడేళ్లుగా జబర్దస్త్ కమెడియన్లకు చాలా అన్యాయం చేసారన్నట్లుగా మాట్లాడాడు ఈయన.

ప్రతీకాత్మక చిత్రం (Image:ETV)
ప్రతీకాత్మక చిత్రం (Image:ETV)


అంతేకాదు కమెడియన్లు ఏమైపోయినా కూడా కేవలం లాభాలు మాత్రమే చూసుకున్నారంటూ మల్లెమాల నిర్మాణ సంస్థపై సంచలన వ్యాఖ్యలు చేసాడు మెగా బ్రదర్. దాంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలే రీ ఎంట్రీకి అడ్డుగా మారుతున్నాయని తెలుస్తుంది. లాక్‌డౌన్ తర్వాత మొదలైన ఎపిసోడ్స్‌లో అదిరింది, జబర్దస్త్ అదిరిపోయే కంటెంట్ అందిస్తున్నాయి. ఈ రెండూ కూడా కామెడీ పరంగా దూసుకుపోతున్నాయి. కానీ రేటింగ్స్ మాత్రం ఎప్పట్లాగే జబర్దస్త్‌కు ఎక్కువగా వస్తున్నాయి. గతంతో పోలిస్తే అదిరింది కూడా పుంజుకుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Adirindi comedy show, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు