Chiranjeevi Acharya: ‘ఆచార్య’ దర్శకుడు కొరటాల లేదంటే బోయపాటి..? సోషల్ మీడియాలో ట్రోల్స్..

ఆచార్య టీజర్ (Acharya teaser)

Chiranjeevi Acharya: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా టీజర్ విడుదలైన క్షణం నుంచి కూడా రచ్చ రచ్చ చేస్తుంది. ముఖ్యంగా ఇందులో చిరంజీవి అప్పియరెన్స్‌కు.. ఆయన ఎనర్జీకి అంతా ఫిదా అయిపోతున్నారు.

  • Share this:
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా టీజర్ విడుదలైన క్షణం నుంచి కూడా రచ్చ రచ్చ చేస్తుంది. ముఖ్యంగా ఇందులో చిరంజీవి అప్పియరెన్స్‌కు.. ఆయన ఎనర్జీకి అంతా ఫిదా అయిపోతున్నారు. ఫ్యాన్స్ అయితే చిరును చూసి పండగ చేసుకుంటున్నారు. టీజర్‌లోనే ఇంత యాక్షన్ ఉందంటే సినిమాలో ఇంకెంత ఉంటుందో అని ఇప్పట్నుంచే లెక్కలేసుకుంటున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ నిజంగానే ఆచార్య టీజర్ అందరికీ నచ్చిందా..? అంటే దీనికి సమాధానం మాత్రం కాస్త కష్టమే చెప్పడం. ఎందుకంటే ఆచార్య టీజర్‌పై పాజిటివ్ వైబ్స్ ఎన్ని వస్తున్నాయో.. నెగిటివ్ రియాక్షన్స్ కూడా అన్నే వస్తున్నాయి. ఓ వైపు న్యూ ఏజ్ మేకింగ్‌తో కుర్ర దర్శకులు కుమ్మేస్తుంటే.. ఇప్పటికీ అదే నరుకుడు, చంపుడు ఏందిరా బాబూ అంటూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. చిరంజీవి లాంటి మెగా హీరో కూడా మూస ఫార్ములానే ఫాలో అయితే ఎలా..? అయినా కొరటాలకు ఏమైంది..? ఆయన గత సినిమాల కంటే ఎందుకు ఆచార్య కాస్త మోతాదుకు మించి యాక్షన్ షూట్ చేస్తున్నాడు అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే అది కథా ప్రకారమే ఉంటుంది కానీ కావాలని చేయరు కదా అంటూ వెంటనే మెగా ఫ్యాన్స్ కూడా గట్టి కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు కొరటాల శివ చేసిన సినిమాల్లో కథ ఎంత ప్రాధాన్యంగా ఉంటుందో తెలుసు కదా.. దాంతో పాటే యాక్షన్, కమర్షియల్ అంశాలు కూడా ఉంటాయని వాళ్లు చెప్తున్నారు.

ఆచార్య టీజర్ (Acharya teaser)


ఇదిలా ఉంటే మరో విషయంలో కూడా ఆచార్య టీజర్‌ను ట్రోల్ చేస్తున్నారు మీమర్స్. టీజర్ నిడివి నిమిషం 7 సెకన్లు ఉంటే అందులో దాదాపు 45 సెకన్ల వరకు కేవలం యాక్షన్ సీన్స్ మాత్రమే ఉన్నాయి. పైగా చిరు చేతిలో ఆయుధాలు కూడా కనిపిస్తున్నాయి. దాంతో ఇది నిజంగానే కొరటాల తెరకెక్కిస్తున్నాడా లేదంటే సాయం కోసం మధ్యలో బోయపాటి వచ్చి వెళ్తున్నాడా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఎందుకంటే యాక్షన్ సీన్స్ చేయాలంటే బోయపాటి పెట్టింది పేరు.

chiranjeevi acharya movie teaser reactions,chiranjeevi acharya movie teaser trolls,koratala siva boyapati sreenu,acharya movie may 13th release,chiranjeevi acharya movie teaser,chiranjeevi,chiranjeevi acharya,chiranjeevi acharya movie,megastar chiranjeevi,chiranjeevi new movie,chiranjeevi 152 movie,acharya teaser,acharya movie chiranjeevi,chiranjeevi 152 movie release date,acharya movie teaser,chiranjeevi latest movie,acharya movie release update,acharya movie temple set,chiranjeevi acharya movie updates,chiranjeevi 152 release date,చిరంజీవి ఆచార్య,ఆచార్య టీజర్ రియాక్షన్స్,చిరంజీవి ఆచార్య విడుదల మే 13న
ఆచార్య టీజర్ (Acharya teaser)


సినిమాలో కథ కంటే యాక్షన్ పార్ట్‌కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటాడు బోయపాటి శ్రీను. అందుకే ఇప్పుడు ఆచార్య టీజర్ చూసిన తర్వాత అలాంటి ట్రోల్స్ వస్తున్నాయి. మొత్తానికి ఏదేమైనా కూడా ఆచార్య టీజర్‌కు అటు పాజిటివ్.. ఇటు నెగిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఎలాగూ చిరు ఈ మధ్య తనపై తానే మీమ్స్ చేసుకుంటున్నాడు. దీన్ని కూడా అంతే సరదాగా తీసుకుంటాడేమో చూడాలిక.
Published by:Praveen Kumar Vadla
First published: