హోమ్ /వార్తలు /సినిమా /

Ramgopal Varma: ప్రేమలో కంటే శృంగారంలోనే నిజాయితీ ఉంది .. రాంగోపాల్‌వర్మ డేంజరస్ కామెంట్‌పై ట్రోలింగ్

Ramgopal Varma: ప్రేమలో కంటే శృంగారంలోనే నిజాయితీ ఉంది .. రాంగోపాల్‌వర్మ డేంజరస్ కామెంట్‌పై ట్రోలింగ్

RGV(photo|twitter)

RGV(photo|twitter)

Ramgopal Varma: ఆర్జీవీ డేంజరస్ సినిమా ప్రమోషన్ కోసం ఇరవై మంది కాలేజీ అమ్మాయిలతో ఇంటర్వూ నిర్వహించారు. ఇందులో అమ్మాయిలు నిస్సిగ్గుగా అడిగిన ప్రశ్నలకు నిస్సందేహంగా సమాధానాలు ఇచ్చారు. మీరు అన్నమే తింటారా అంటే తడుముకోకుండా సమాధానం చెప్పారు వర్మ. అంతే కాదు ప్రేమ కంటే శృంగారమే పవిత్రమైందంటూ కొత్త నిర్వచనం చెప్పారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ (Ramgopal varma)తనకు నచ్చినట్లుగా మాట్లాడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తారు. అది ఏ విషయమైనా తన కోణంలో ఏమనిపిస్తే అదే చెబుతారు. తాజాగా డేంజరస్ (Dangerous)అనే లెస్బియన్స్ లవ్ స్టోరీతో కూడిన శృంగారభరితమైన సినిమాకు దర్శకత్వం వహించారు ఆర్జీవీ. ఈ సినిమా డిసెంబర్‌(December)9న రిలీజవుతోంది. సినిమా ప్రమోషన్‌ని డిఫరెంట్‌గా చేస్తున్న వర్మ ..ఆదివారం 20మంది అమ్మాయిలతో సినిమాకు సంబంధించిన ఇంటర్వూ నిర్వహించారు. ఆ ఈవెంట్‌లో ప్రేమ, శృంగారానికి సంబంధించి ఓ అమ్మాయి వేసిన ప్రశ్నకు బోల్డ్‌గా ఆన్సర్ ఇచ్చారు రాంగోపాల్‌వర్మ. అంతే కాదు ప్రేమలో మోసం ఉంటుంది కాని శృంగారంలో ఉండదంటూ పెద్ద బాంబే పేల్చారు ఆర్జీవీ. ఎంతో ఆసక్తికరంగా సాగిన ఈ ఇంటర్వూపై నెటిజన్లు(Netizens)డిఫరెంట్‌గా స్పందిస్తున్నారు. అమ్మాయిలు అడిగిన ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానాలపై కొందరు ట్రోల్ చేస్తుంటే మరికొందరు పొగుడుతున్నారు.

Anasuya: బటన్స్ లేని షర్ట్‌లో ఎద సంపద చూపిస్తున్న జబర్దస్త్ బ్యూటీ .. అనసూయ హాట్‌ ఫోటోస్‌ కేక

కాంట్రవర్సీ కింగ్‌ ..

రాంగోపాల్‌వర్మ .. పరిచయం చేయాల్సిన పర్సనాలిటీ కాదు. ఎప్పుడో ట్రెండ్ సెట్ చేసిన సినిమాలు తీసి క్రేజీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత అంతే దారుణమైన ఫ్లాప్ సినిమాలు తీసి చెత్త డైరెక్టర్ అని కూడా ముద్రవేసుకున్నారు. ఇక ఇవన్నీ చాలదంటూ కొత్తగా ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ, రొమాన్స్‌తో కూడిన లెస్బియన్స్‌ లవ్ స్టోరీని కథగా ఎంచుకొని డేంజరస్ అంటూ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు ఆర్జీవీ.ఈసినిమా ప్రమోషన్ కోసం ఇరవై మంది కాలేజీ అమ్మాయిలతో ఇంటర్వూ నిర్వహించిన వర్మ ..అమ్మాయిలు నిస్సిగ్గుగా అడిగిన ప్రశ్నలకు నిస్సందేహంగా సమాధానాలు ఇచ్చారు. ఉదాహరణకు ఎలాంటి సమాధానాలు అంటే ..మీరు అన్నమే తింటారా అంటే తడుముకోకుండా సమాధానం చెప్పారు వర్మ.

20మంది అమ్మాయిలతో ఆర్జీవీ..

ముఖ్యంగా ఆర్జీవీ ఆడపిల్లలు చేసిన ఇంటర్వూలో ప్రేమ, శృంగారం ఈ రెండింటిలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది సినిమాలో అంటే ..రెండు కలిసే ఉంటాయి అంటూ వెరైటీ ఆన్సర్ ఇచ్చారు. నా దృష్టిలో ప్రేమ, శృంగారం కలిసే ఉంటాయన్నారు. ప్రకృతిలో ఈ రెండు సమానమే అన్నారు. అంతే కాదు ..ప్రేమలో అయినా మోసం ఉంటుందేమో కాని ..శృంగారంలో మోసం ఉండదని...వర్మ చెప్పిన ఆన్సర్‌కి నెటిజన్లు డిఫరెంట్‌గా ట్వీట్‌లు చేస్తున్నారు. వర్మను ఇంటర్వూ చేసిన వాళ్లంతా జూనియర్‌ ఆర్టిస్టులేనేమో అంటూ కొందరు ట్వీట్ చేస్తే ...మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజమంటూ మరికొందరు రీ ట్వీట్‌లు చేస్తున్నారు.

నెట్టింట్లో ఆర్జీవీపై ట్రోలింగ్..

ఓవరాల్‌గా డేంజరస్‌ సినిమా ఫ్యామిలీ అంతా వచ్చి థియేటర్‌కు వచ్చి చూసే సినిమా కాదని..ఒకరికి తెలియకుండా మరొకరు విడి విడిగా వచ్చి చూస్తారంటూ తన కాన్ఫిడెన్స్‌ని మరోసారి పబ్లిక్‌గా చెప్పారు రాంగోపాల్‌వర్మ. సినిమా హిట్టైనా, ఫ్లాపైనా రియాక్షన్‌ కూడా పెద్దగా చూపించని రాంగోపాల్‌వర్మ ..తనకు సిగ్గు లేదు కాబట్టే ఇలాంటి సినిమా తీశానంటూ తనపై తానే సెటైర్ వేసుకున్నారు.

వర్మ ప్లాన్ బెడిసి కొట్టనట్లేనా..

ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు లేని ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ తెరకెక్కించిన డేంజరస్‌ సినిమా ఎలాంటి రిజల్స్ట్ చవి చూస్తుందో అనే డౌట్స్ ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. అయితే ఆర్జీవీతో ఇంటర్వూలో పాల్గొన్న అమ్మాయిలంతా డబ్బులు ఇచ్చి స్వయంగా ఆయనే అడిగించుకున్న ప్రశ్నలని మరో నెటిజిన్ ట్వీట్‌ ద్వారా రాంగోపాల్‌వర్మ క్రియేటివిటీని తీసిపారేశాడు.

First published:

Tags: Ramgopal varma, Tollywood

ఉత్తమ కథలు