హోమ్ /వార్తలు /సినిమా /

ఏం మాయ చేద్దామని ..సమంతని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

ఏం మాయ చేద్దామని ..సమంతని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Viral News: హీరోయిన్లు, సమంత, తాప్సి పొన్నుని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు ఫ్యాన్స్. అవార్డ్స్ ఫంక్షన్‌కి సమంత వేసుకున్న డ్రెస్‌తో పాటు ఆమె హెయిర్ స్టైల్‌కి వంక పెడుతూ సెటైర్లు వేస్తున్నారు.

Viral News: హీరోయిన్లు, సమంత, తాప్సి పొన్నుని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు ఫ్యాన్స్. అవార్డ్స్ ఫంక్షన్‌కి సమంత వేసుకున్న డ్రెస్‌తో పాటు ఆమె హెయిర్ స్టైల్‌కి వంక పెడుతూ సెటైర్లు వేస్తున్నారు.

Viral News: హీరోయిన్లు, సమంత, తాప్సి పొన్నుని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు ఫ్యాన్స్. అవార్డ్స్ ఫంక్షన్‌కి సమంత వేసుకున్న డ్రెస్‌తో పాటు ఆమె హెయిర్ స్టైల్‌కి వంక పెడుతూ సెటైర్లు వేస్తున్నారు.

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ డ్రెస్‌ డిజైనింగ్ ఛాయిస్ డిఫరెంట్‌గా ఉంటోంది. ముఖ్యంగా సౌత్‌ హీరోయిన్‌ల విషయానికి వస్తే సినిమా హిట్ కావడంతో వాళ్లకు వస్తున్న క్రేజ్, పాపులారిటి, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని దృష్టిలో పెట్టుకొని ఏకంగా హాలీవుడ్‌ రేంజ్‌ హీరోయిన్లుగా ఫీలవుతున్నారు. హలీవుడ్ స్థాయిలోనే కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్ మెయిన్‌టెన్‌ చేస్తున్నారు. ఈ విషయంలోనే సౌత్, నార్త్‌ యాక్టరస్‌ల డ్రెస్‌ సెన్స్‌పై నెటిజన్లు తెగ కామెంట్ చేస్తున్నారు. అవార్డ్ ఫంక్షన్‌లు, గెట్ టు గెదర్ పార్టీలకు వీళ్లు వేసుకెళ్తున్న డ్రెస్‌లు, హెయిర్‌ స్టైల్‌ చూసి తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి విమర్శల్లో నలిగిపోతోంది సౌత్ యాక్టరస్ సమంత రుత్‌ప్రభు(Samantha Rutraprabhu). రీసెంట్‌గా క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డ్స్ (Critics Choice Award)ఈవెంట్‌కి వేసుకెళ్లిన డ్రెస్‌ని తెగ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌కి వరల్డ్ స్టార్స్ వేసుకున్నట్లుగా డీప్‌ నెక్ ఎమరాల్డ్ గ్రీన్ అండ్ బ్లాక్‌ ఫ్లోర్‌లెన్త్ గౌన్‌ (deep neck emerald green and black floor length gown)వేసుకెళ్లింది. అయితే సమంత ఈ డ్రెస్‌లో అందర్ని ఆకర్షించాలని ప్రయత్నించింది కాని అందరూ ఆమె వేసుకున్న డ్రెస్‌తో అన్‌కంఫర్ట్‌నెస్‌గా ఫీలవడం చూసి తెగ ట్రోల్ చేస్తున్నారు. అవార్డ్ ఫంక్షన్‌కి వేసుకెళ్లిన డ్రెస్‌తో దిగిన ఫోటోలను ఇన్‌స్టా (Instagram)హ్యాండిల్‌లో షేర్ చేసింది సమంత. వాటిని చూపిస్తూ తెగ కామెంట్స్ చేస్తున్నారు ఫాలోవర్స్. సోషల్ మీడియా ఫాలోవర్సే కాదు బాలీవుడ్‌ సెలబ్రిటీలు సైతం సమంత వేసుకున్న డ్రెస్‌ ఏమి బాగోలేదంటూ వెటకారం ఆడుతున్నారు. నేహాశర్మ ఇదేం డ్రెస్ అని కామెంట్ చేస్తే మరొకరు బట్టలు పైన వేసుకోవాలి కాని చీపురులా నేల ఊడవటానికి కాదంటూ సెటైర్లు వేశారు. త్వరగా అవార్డ్‌ ఫంక్షన్‌కి రావాలన్న తొందరలో బెడ్రూంలోని దుప్పటి కూడా లాక్కొచ్చావా అంటూ సోనాల్‌శర్మ టీజ్ చేస్తున్నారు. ఇక డ్రెస్‌ డిజైన్‌పై ఇలాంటి ట్రోలింగ్ జరిగితే సమంత హెయిర్‌ స్టైల్‌పై కూడా నెగిటివ్ కామెంట్స్‌నే షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఏంటా జుట్టు, అదేం డ్రెస్సు..

ముందు చింపిరి జుట్టుతో వెనుక చిన్న జడ వేసుకోవడం చూసిన వాళ్లంతా సమంతకు ఏమైంది అని విమర్శిస్తున్నారు. పుష్ప సినిమాలో ఊ అంటా మావా ఐటమ్ సాంగ్‌తో సమంత స్టార్ ఇమేజ్‌ రెట్టింపు అయింది. దీంతో ఆమె ఇలాంటి చీప్‌ కాస్ట్యూమ్స్‌తో ఈమధ్య తెగ కనిపిస్తోందని మరికొందరు సటైర్లు వేస్తున్నారు.

తాప్సీని వదల్లేదు నెటిజన్లు..

మరో సౌత్ యాక్టరస్ తాప్సిని కూడా నెటిజన్లు తెగ కామెంట్ చేస్తున్నారు. మిర్చి మ్యూజిక్ అవార్డ్ ఫంక్షన్‌కి అటెండ్ అయిన తాప్సీ..ఫుల్ బ్లాక్ జర్కిన్‌ టైప్ డ్రెస్‌ వేసుకుంది. అయితే హెయిర్‌ స్టైల్‌ జడ అల్లుకొని రావడంతో అక్కడున్న కెమెరామెన్లు ఆమెను ఆటపట్టించారు. డ్రెస్ ట్రెండీగా హెయిర్ స్టైల్ ట్రెడిషనల్‌గా ఉందంటూ ఆమెపై సెటైర్లు వేసుకున్నారు.

చూడలేక చస్తున్నాం బాబోయ్..

హీరోయిన్లు సినిమాల్లో గ్లామర్‌గా కనిపించినా, అందాలు ఆరబోసిన ప్రేక్షకులకు నచ్చుతుంది. తమ అభిమాన హీరోయిన్లను పాజిటివ్‌గా రిసీవ్ చేసుకుంటారు. కాని రియల్‌ లైఫ్‌లో వెరైటీ డ్రెస్‌లు, విచిత్రమైన హెయిర్‌ స్టైల్స్‌తో కనిపిస్తే మాత్రం సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేసి పరువుతీస్తున్నారు.

First published:

Tags: Samantha Ruth Prabhu, Tapsee pannu, Viral Video

ఉత్తమ కథలు