సోషల్ మీడియాలో కొందరు చాలా దురుసుగా ఉంటున్నారు. నోటికి ఏదోస్తే అదే మాట్లాడుతున్నారు. అవతలవారి ఫీలింగ్స్‌తో పని లేకుండా పోస్టులు పెడుతున్నారు.సెలబ్రిటీల పోస్టులకు దారుణంగా రిప్లైలు ఇస్తున్నారు. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అయిన అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan)ను సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు అవమానించారు. అయితే అమితాబ్ కూడా అదే రేంజ్‌లో నెటిజన్లకు రిప్లై ఇచ్చారు. అమితాబ్ ఎన్ని పనులతో బిజీగా ఉన్నా.. సోషల్ మీడియా(Social Media)లో మాత్రం యాక్టివ్‌గానే ఉంటున్నారు. కానీ.. ఆయన చేసిన ఓ పోస్టు తెగ ట్రోలింగ్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఆయనను ఎగతాళి చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ మాత్రం ఓ అడుగు ముందుకేసి వ్యంగ్యంగా మాట్లాడాడు. దీంతో అతనికి అదే రేంజ్‌లో స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు బిగ్ బి... దీంతో ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఉదయం ఎప్పటిలాగానే తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు గుడ్ మార్నింగ్ విషెస్ చెప్పారు. అయితే.. ఆయన పోస్టు చేసినప్పుడు సమయం 11 దాటి పోయింది. అయితే అమితాబ్(Amitabh Bachchan) చేసిన ఈ చిన్న పోస్టే విమర్శలకు కారణమైంది. ఇంకా ఉదయమా ? అంటూ పలువురు ప్రశ్నలు వేశారు. ఇది ఉదయం కాదు.. ఓల్డ్ మేన్.. మధ్యాహ్నం అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు ఓ నెటిజన్. వీటిపై అమితాబ్ సున్నితమైన సమాధానాలు ఇచ్చారు. తనను హేళన చేసినందుకు థాంక్స్ ముందుగా చెప్పారు. ముఖ్యమైన పనికోసం రాత్రి వేళ చాలా సేపు మెలుకవతో ఉండాల్సి వచ్చిందని.. అందుకే నిద్ర లేవడం ఆలస్యమైందని చెప్పుకొచ్చారు.
లేచిన వెంటనే శుభాకాంక్షలు చెప్పినట్లు.. మీరు బాధపడితే క్షమించాలంటూ పోస్టు చేశారు. మీ వృద్దాప్యంలో మిమ్మల్ని ఎవరూ అవమానించకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు సెటైర్స్ వేశారు. ఇక దీంతో పలువురు నెటిజన్లు 11.30 కు గుడ్ మార్నింగ్ ఏంటి..? ఎర్లీ మార్నింగ్ అనుకుంటున్నారా..? అని ఒక నెటిజన్ అడగగా.. “క్షమించాలి.. మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఉంటే .. రాత్రంతా షూటింగ్ లో ఉండి ఉదయాన్నే వచ్చి పడుకున్నాను.. ఇప్పుడే లేచాను .. నేను లేచిన నిమిషం నాకు గుడ్ మార్నింగే కదా.. అందుకే అందరిని పలకరించాను” చెప్పుకొచ్చారు.
ఇక మరో నెటిజన్ అయితే ‘ఇది మధ్యాహ్నం ముసలోడా’ అంటూ దురుసుగా మాట్లాడినా అతడి కూడా ఓపిగ్గా సమాధానం ఇచ్చాడు బిగ్ బి.. “మీరు చాలా కాలం బతకాలని ప్రార్థిస్తున్నాను.. అయితే మిమ్మల్ని ఎవరూ ముసలోడు అని పిలిచి అవమానించకూడదని కోరుకుంటున్నా” అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో పెద్దవారిని ఎలా గౌరవించాలో అమితాబ్ ఆ నెటిజన్‌కు కొట్టకుండానే చెప్ప చెల్లుమనిపించేలా చెప్పాడు. దీంతో ఇప్పుడు ఇక అమితాబ్ కు పలువురు సపోర్ట్ ఇస్తున్నారు. ఆయన ఎక్స్ పీరియన్స్ అంత వయస్సు ఉండదు నీకు.. ఆయనను అవమానిస్తావా..? అంటూ మరికొందరు నెటిజన్స్ సదరు వ్యక్తిని విమర్శిస్తున్నారు. మొత్తానికి బిగ్ బీ ట్వీట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amitabh bachchan, Bollywood, Social Media