సునీల్‌ను క‌న్ఫ్యూజ‌న్‌లో ప‌డేసిన త్రివిక్ర‌మ్..

సునీల్‌ను కొన్ని రోజులు కమెడియన్‌గానే చూసాం.. కొన్నేళ్ల పాటు అది తప్ప ఆయన మరో పాత్ర చేయనే లేదు. ఆ తర్వాత హీరోగా చూసాం.. మళ్లీ ఇప్పుడు ఈయన రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు కొత్త సునీల్‌ను పరిచయం చేస్తున్నాడు. కారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 12, 2018, 11:15 AM IST
సునీల్‌ను క‌న్ఫ్యూజ‌న్‌లో ప‌డేసిన త్రివిక్ర‌మ్..
సునీల్ త్రివిక్రమ్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 12, 2018, 11:15 AM IST
సునీల్ క‌మెడియ‌న్ కాదు అని వారం రోజుల కింద షాక్ ఇచ్చాడు ఎన్టీఆర్. అస‌లు మ‌నం సునీల్‌ను క‌మెడియ‌న్‌గా చూస్తున్నాం కానీ ఆయ‌న అస‌లు అది కాదు.. అత‌డిలో మ‌రో మ‌నిషి ఉన్నాడ‌ని చెప్పాడు. సునీల్ మంచి న‌టుడు అని మ‌నం ఎప్పుడూ అత‌న్ని అలా చూడాలి కానీ క‌మెడియ‌న్‌గా ప‌రిమితం చేయ‌కూడ‌దు అని చెప్పాడు జూనియ‌ర్. ఆయ‌న అలా ఎందుకన్నాడో ఇప్పుడు అర్థం అవుతుంది.


సునీల్‌ను క‌న్ఫ్యూజ‌న్‌లో ప‌డేసిన త్రివిక్ర‌మ్.. trivikram turns sunil as character artist in aravinda sametha..
సునీల్ ఎన్టీఆర్
అర‌వింద స‌మేత‌లో అంతా సునీల్ క‌మెడియ‌న్‌గా కుమ్మేస్తాడు.. మ‌ళ్లీ "నువ్వు నాకు న‌చ్చావ్"లో బంతి టైప్‌లో న‌వ్వులు పూయిస్తాడు అనుకున్నారు. కానీ త్రివిక్ర‌మ్ షాక్ ఇచ్చాడు. సునీల్‌ను క‌మెడియ‌న్‌గా కాకుండా న‌టుడిగా రీ ఎంట్రీ ఇప్పించాడు. ఇప్ప‌ట్నుంచి సునీల్‌ను క‌మెడియ‌న్ అనాలో.. లేదంటే కారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అనాలో తెలియ‌ని క‌న్ఫ్యూజ‌న్‌లో ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను ప‌డేసాడు. ఎందుకంటే "అర‌వింద స‌మేత‌"లో కేవ‌లం హీరోకు ప‌క్క‌నుండే పాత్రే కాకుండా.. క‌థ‌కు ప‌నికొచ్చే పాత్ర‌లో న‌టించాడు సునీల్.

సునీల్‌ను క‌న్ఫ్యూజ‌న్‌లో ప‌డేసిన త్రివిక్ర‌మ్.. trivikram turns sunil as character artist in aravinda sametha..
సునీల్ ఫేస్‌బుక్ ఫోటో


ఇది చూసిన త‌ర్వాత ఇప్ప‌ట్నుంచీ ఈయ‌న కోసం సీరియ‌స్ రోల్స్ కూడా రాసుకోవ‌చ్చేమో అనిపించింది. అందుకే సునీల్ కమెడియ‌న్ మాత్ర‌మే కాదు.. మంచి న‌టుడు కూడా అని చెప్పాడు ఎన్టీఆర్. ఇప్పుడు దానికి సాక్ష్యం చూపించాడు. మ‌రి చూడాలిక‌.. ఇప్పుడు న‌టిస్తున్న అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ.. ప‌డిప‌డి లేచే మ‌న‌సు.. చిత్ర‌ల‌హ‌రి లాంటి సినిమాల్లో సునీల్ పాత్ర ఎలా ఉండ‌బోతుందో..?
First published: October 12, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...