హోమ్ /వార్తలు /సినిమా /

Trivikram : ఆ రకంగా సూర్య కోరికను తీర్చనున్న త్రివిక్రమ్..

Trivikram : ఆ రకంగా సూర్య కోరికను తీర్చనున్న త్రివిక్రమ్..

త్రివిక్రమ్, సూర్య Photo : Twitter

త్రివిక్రమ్, సూర్య Photo : Twitter

Trivikram : చాలా కాలంగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య,  తెలుగులో డైరెక్ట్ మూవీ చేయాలనుకుంటున్న విషయం తెల్సిందే.

  తెలుగు సినీ పరిశ్రమలో లాక్ డౌన్ చాలా మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా దర్శకులకు కొత్త కథలు రాసుకునేందుకు చాలా సమయం దొరికింది. ఆల్రేడీ లాక్ అయిన సబ్జెక్ట్స్ కు మెరుగులు దిద్దుకున్నారు. కొత్త కథల కోసం పెన్ను పట్టుకున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు కూడా లాక్ డౌన్ సమయాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. తారక్ తో చేయాల్సిన సినిమాకు స్టోరీని పూర్తి చేసాడు. అరవింద సమేత కంటే బెటర్ గా మరింత పవర్ ఫుల్ గా ఈ స్టోరీ ఉండబోతోందట. త్రిబుల్ ఆర్ షూటింగ్ షెడ్యూల్స్ ను బట్టి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకుంటున్నారు తారక్ ,త్రివిక్రమ్. హారిక హాసినీ, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో టైగర్ కు జోడీగా కియారా అడ్వానీ నటిస్తోందని బాగా ప్రచారం సాగుతోంది. ఈ సంగతి ఇలా ఉంటే చాలా కాలంగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య,  తెలుగులో డైరెక్ట్ మూవీ చేయాలనుకుంటున్న విషయం తెల్సిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలోనే తెలుగులో డైరెక్ట్ మూవీ చేయాలని సూర్య కోరిక. ఆ కోరిక ఇంత కాలానికి నెరవేరబోతోంది. ఎందుకంటే లాక్ డౌన్ సమయంలో తారక్ కోసమే కాదు సూర్య తో చేయాల్సిన సినిమా కథను కూడా త్రివిక్రమ్ పూర్తి చేసాడట.

  గతంలోనే త్రివిక్రమ్ చెప్పిన లైన్ కు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. లాక్ డౌన్ సమయంలో ఆ లైన్ ను డెవలప్ చేసి, సూర్య ఇమేజ్ కు తగ్గట్లు కథను సిద్దం చేసాడట త్రివిక్రమ్. కోలీవుడ్ లో చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నాడు సూర్య. వెంకటేష్ తో గురు చిత్రం తెరకెక్కించిన సుధా కొంగర దర్శకత్వంలో ప్రస్తుతం ఆకాశం నీ హద్దురా అనే సినిమాలో నటిస్తున్నాడు సూర్య. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. త్వరలోనే అసురన్ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న కొత్త సినిమా వాడివసల్ సెట్స్ పైకి వెళ్లనుంది. తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.

  అరవింద సమేతతో త్రివిక్రమ్ లో వేగం పెరిగింది. 5 నెలల్లో సినిమాను పూర్తి చేసి బ్లాక్ బస్టర్స్ ఖాతా వేసుకుంటున్నాడు మాటల మాంత్రికుడు. అల వైకుంఠపురములో సినిమాను కూడే అంతే స్పీడ్ గా పూర్తి చేసి కెరీర్ లో బిగ్ హిట్ అందుకున్నాడు.

  మునుముందే అదే వేగాన్ని కొనసాగించబోతున్నాడు. తారక్ తో మూవీ తర్వాత సూర్య డేట్స్ అందుబాటులో ఉండటాన్ని బట్టి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని హారికా హాసిని క్రియేషన్స్ తో పాటు కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Suriya, Tollywood news, Trivikram Srinivas

  ఉత్తమ కథలు