పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలకు ఓకే చెప్పుతున్నాడు. ఆయన ఇప్పటికే ‘వకీల్ సాబ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా హిందీ సినిమా పింక్‌కు రీమేక్ గా వస్తోంది. కరోనా లాక్ డౌన్లో కొన్ని సడలింపులు ఇవ్వడంతో వకీల్ సాబ్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. చివరి షెడ్యూల్ నడుస్తోంది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన మలయాళ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ స్టార్ట్ చేస్తారు. ఈ చిత్రాన్ని సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేయనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ సుమారు 40 రోజులు డేట్స్ కేటాయించారట. ఈ సినిమాలో పవన్‌తో పాటు మరో కీలక పాత్రలో రానా నటిస్తున్నాడని టాక్ నడిచిన సంగతి తెలిసిందే. అయితే దీని గురించి అధికారికంగా సమాచారం లేదు. కానీ తాజాగా వస్తోన్న సమాచారం మేరకు రానాను ఆ క్యారెక్టర్ కోసం చిత్రబృంద సంప్రదించిదట. రానా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. చూడాలి మరి ఈ పాత్రలో నటించడానికి రానా ఒకే చెపుతాడో లేదో. అన్నీ కుదిరితే ఆయనే సినిమాలో నటిస్తారని అర్థమవుతోంది.
ఒక వేళ నటించడానికి ఒప్పుకుంటే.. ఆయన సరసన నివేధా నటించే అవకాశం ఉందట. అయితే రానా పేరు కూడా దాదాపుగా ఖాయమే. ఇక పవన్ పక్కన సాయిపల్లవి నటించనుంది. ఇకపోతే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అది అలా ఉంటే ఈ సినిమా గురించి మరో క్రేజీ గాసిప్ ఒకటి హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రానికి పవన్ కు సన్నిహితుడు, దర్శకుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారని టాక్. అంతేకాదు త్రివిక్రమ్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లేను కూడా అందిస్తారని అంటున్నారు. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.. ఒకవేళా అదే నిజమైతే త్రివిక్రమ్ పవన్ సినిమా విషయంలో ప్రముఖ పాత్ర పోషించినట్లే.

నివేదా, సాయి పల్లవి Photo : Twitter
ఇక పవన్ నటిస్తోన్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఎన్నికలకు సమయం ఉన్నందున.. పవన్ ఆ ఖాలీ సమయాన్ని సినిమాలకు వెచ్చిస్తున్నాడు. అందులో భాగంగా ఆయన హిందీలో సూపర్ హిట్ అయినా పింక్ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు. వకీల్ సాబ్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను దిల్ రాజు, బోణి కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకుడు. ఈ సినిమాతో పాటు పవన్ మరో రెండు సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తోన్న సినిమా ఒకటి. పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈ సినిమా. దీన్ని ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం నిర్మిస్తున్నాడు. ఈ సినిమా పీరియాడిక్ మూవీగా వస్తోంది. కొంత షూటింగ్ కూడ జరుపుకున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా కావడంతో ఈసినిమాను పాన్ ఇండియా లెవల్లో అప్పీల్ కావడంతో అన్ని భాషాల్లో విడుదల చేయనుంది చిత్రబృందం. విరూపాక్ష అనే పేరును పరిశీలిస్తోంది చిత్రబృందం. ఈ సినిమాతో పాటు పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాను చేయనున్నాడు పవన్. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సివుంది.
Published by:Suresh Rachamalla
First published:December 17, 2020, 07:49 IST