త్రివిక్రమ్‌కు బంపర్ ఆఫర్.. భారీ సినిమాలో అవకాశం..

త్రివిక్రమ్ తాజాగా 'అల..వైకుంఠపురములో..' సక్సెస్ తో తన క్రేజ్ ని మరింతగా పెంచుకున్నాడు.

news18-telugu
Updated: April 7, 2020, 7:13 AM IST
త్రివిక్రమ్‌కు బంపర్ ఆఫర్.. భారీ సినిమాలో అవకాశం..
త్రివిక్రమ్: ముందు రైటర్‌గా వచ్చి ఆ తర్వాత దర్శకుడిగా మారాడు త్రివిక్రమ్. డైరెక్టర్ అయిన తర్వాత కూడా పవన్ తీన్‌మార్ సినిమాకు డైలాగ్స్ రాసాడు.. నితిన్ ఛల్ మోహన్ రంగా సినిమాకు కథ అందించాడు.
  • Share this:
త్రివిక్రమ్ తాజాగా 'అల..వైకుంఠపురములో..' సక్సెస్ తో తన క్రేజ్ ని మరింతగా పెంచుకున్నాడు. చాలా కాలం తరువాత త్రివిక్రమ్ అందుకున్న బిగ్గెస్ట్ హిట్ ఇదే. వరల్డ్ వైడ్ గా ఆ చిత్రం 200కోట్లకు పైగా వసూళ్లను సాధించడంతో మాటల మాంత్రికుడికి మంచి క్రేజ్ వచ్చింది. దీంతో నెక్స్ట్ సినిమాపై కూడా అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. త్రివిక్రమ్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. కళ్యాణ్ రామ్, చినబాబు కలిసి ఆ సినిమాను నిర్మిస్తున్నారు. అది అలా ఉంటే త్రివిక్రమ్‌ మీద ఓ క్రేజీ న్యూస్ బయటకువచ్చింది. త్రివిక్రమ్ ఓ వ్యాపారవేత్త కుమారుడిని హీరోగా ఇంట్రడ్యూస్ చేసే బాధ్యతను తీసుకున్నాడట. ఈ సినిమాను దాదాపు 200 కోట్లతో నిర్మించనున్నారని.. దీనికోసం త్రివిక్రమ్ దాదాపు 35కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు టాక్. అయితే ఈ సినిమా ఎన్టీఆర్ సినిమా తరువాత రానుందని సమాచాంర. ఎన్టీఆర్ 30 తరువాత చరణ్‌తో త్రివిక్రమ్ ఒక సినిమా చేయాల్సివుంది. ఆ ప్రాజెక్టు ఒకవేళ ఆలస్యమైతే త్రివిక్రమ్ ఈ కొత్త కుర్రాడితో సినిమా చేసే అవకాశం మెండుగా ఉందట. లేదంటే చరణ్ ప్రాజెక్టు పూర్తయిన తరువాతనే ఆ సినిమాను చేస్తాడని చెబుతున్నారు. త్రివిక్రమ్ పై వస్తోన్న ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే మరి.
Published by: Suresh Rachamalla
First published: April 7, 2020, 7:13 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading