SP Balasubrahmanyam: పాటల మాంత్రికుడికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నివాళి, తనదైన శైలిలో

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంతో ఎంతోమంది సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పాటల మాంత్రికుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి నివాళి అర్పించారు.

news18-telugu
Updated: September 25, 2020, 9:35 PM IST
SP Balasubrahmanyam: పాటల మాంత్రికుడికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నివాళి, తనదైన శైలిలో
త్రివిక్రమ్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
  • Share this:
గాన గంధర్వుడు, తెలుగువారి ప్రీతిపాత్రమైన గొంతు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కన్నుమూశారు. ఆయన మరణంతో ఒక్క తెలుగు సిని పరిశ్రమ కాదు. భారతీయ సిని పరిశ్రమ ఓ గొప్ప గాయకుడిని కోల్పోయింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంతో ఎంతోమంది సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు. ఎస్పీ బాలుతో తమకు ఉన్న అనుబంధం గురించి, ఎస్పీ బాలు గొప్పదనం గురించి, ఆయన చేసిన సంగీత సేవ గురించి ప్రస్తావించారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎస్పీ బాలు మృతికి నివాళి అర్పించారు.

ఎస్పీ బాలుకి త్రివిక్రమ్ నివాళి

‘ఎస్ పి బి
మూడు తరాల్ని
ఉర్రూతలూగించిన మూడక్షరాలు

కొందరికి వయసు రాదు.
మరణం ఉండదు.బాలు గారు కూడా వాళ్ళలో ఒకరు.
ఆయన ప్రతిభ అపారం..
ఆయన కీర్తి అమరం..
ఆయన పాట చిరస్మరణీయం..
వారి కుటుంబ సభ్యులకు
ప్రపంచం నలుమూలల
అశేషంగా ఉన్న ఆయన అభిమానులకి...వాళ్ళలో నేను కూడా ఒకడిని
అందరికీ నా ప్రగాఢసానుభూతిని తెలియజేస్తున్నాను.

త్రివిక్రమ్’

అంటూ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పాటల మాంత్రికుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి నివాళి అర్పించారు.

అతడు సినిమాలో నాజర్‌కు డబ్బింగ్ చెప్పిన ఎస్పీ బాలు


త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన పలు సినిమాల్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడారు. అలాగే, ముఖ్యంగా వారిద్దరి కాంబినేషన్ గురించి చెప్పాలంటే మహేష్ బాబు హీరోగా వచ్చిన అతడు సినిమా గురించి చెప్పాలి. ఆ సినిమాలో నాజర్ క్యారెక్టర్‌కు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ చెప్పారు. మెడకు పట్టీ వేసుకుని నాజర్ పలికే డైలాగ్స్‌కు ఎస్పీ బాలు తన డబ్బింగ్‌తో ప్రాణం పోశారు. ఈ సినిమాలో ఎస్పీ బాలు డబ్బింగ్ ఆయనకే చెందిన ఎస్పీ కోదండపాణి స్టూడియోలో జరిగింది. డబ్బింగ్ డైలాగ్స్ అన్నీ అయిపోతున్నాయి. మహేష్ బాబుకి గన్ ఇచ్చి ‘వెళ్లు. గెలిస్తే రా. గెలవకపోతే నువ్వు ఏమైపోయావనే నిజం నాకు తెలియనివ్వకు. ఈ వయసులో నాక్కావాల్సింది అబద్ధాలు, నిజాలు కావు. జ్ఞాపకాలు. నీ వల్ల నాకుఅవి బోల్డన్ని ఉన్నాయ్ చాలు.’ అని నాజర్ డైలాగ్స్ చెప్పిన తర్వాత మహేష్ బాబు నాజర్ కాళ్లకు వెనుక నుంచి వచ్చి దండం పెడతాడు.

ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)
ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)


వాస్తవానికి ఈ సీన్‌లో నాజర్ డైలాగ్ అంతటితో అయిపోయింది. కానీ, ఆ సీన్ డబ్బింగ్ చెబుతున్న సమయంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ... మహేష్ బాబు సడన్‌గా నాజర్ కాళ్ల మీద పడినప్పుడు అనుకోకుండా ‘జాగ్రత్త’ అని అప్రయత్నంగా అనేశారు. వాస్తవానికి ఆ డైలాగ్ లేదు. ఈ సీన్ చూస్తే నాజర్ డైలాగ్ కనిపించదు. కేవలం వినిపిస్తుంది. ఓ తాతకు తన మనవడి మీద ఉన్న ప్రేమను చూపుతూ చివర్లో బాలు అన్న ‘జాగ్రత్త’ అన్న మాటను వినగానే త్రివిక్రమ్ థ్రిల్ అయిపోయారు. ఆ ఒక్క డైలాగ్‌తో ఓ తాత అంతరంగాన్ని, అంతర్గత సంఘర్షణ, తాపత్రయాన్ని చెప్పారు అంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి కృతజ్ఞతలు చెప్పారు. ఇలా చిన్న చిన్న డైలాగ్స్‌తో మాత్రమే కాదు. తన చిన్న చిన్న చిలిపితనాన్ని, చిలిపి పదాలను జోడించి ఎన్నో పాటలకు ప్రాణం పోశారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 25, 2020, 9:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading