అల్లు అర్జున్ కోసం సెంటిమెంట్‌ను వదులుకుంటున్న త్రివిక్రమ్

అజ్ఞాతవాసి, అ ఆ, అరవింద సమేత... ఈ కోవలోకే వస్తాయి. ఇందులో అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ అయినా... మిగతా మూడు సినిమాలు మాత్రం సూపర్ హిట్ అనిపించుకున్నాయి. దీంతో ఆయన తీయబోయే కొత్త సినిమా టైటిల్ కూడా అ అనే అక్షరంతోనే మొదలవుతుందని చాలామంది భావించారు.

news18-telugu
Updated: July 24, 2019, 4:06 PM IST
అల్లు అర్జున్ కోసం సెంటిమెంట్‌ను వదులుకుంటున్న త్రివిక్రమ్
త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్
news18-telugu
Updated: July 24, 2019, 4:06 PM IST
సినిమా ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్లుకు కేరాఫ్ అడ్రస్. కథ, కథనం, స్టార్స్... ఇలా ఎన్ని ఉన్నా... సెంటిమెంట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు సినీజనం. ఏదేమైనా... తమకు కలిసొచ్చిన సెంటిమంట్‌ను వదులుకోవడానికి అస్సలు అంగీకరించరు. అయితే టాలీవుడ్‌లోని ఓ స్టార్ డైరెక్టర్ మాత్రం... ఈ విషయంలో కాస్త వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు అ అనే అక్షరం ఓ సెంటిమెంట్. మొదట్లో ఈ సెంటిమంట్‌ను అంతగా ఫాలో కాకపోయినప్పటికీ... అత్తారింటికి దారేది సినిమా తరువాత తెరకెక్కించిన తన సినిమాలన్నింటికీ అ అనే అక్షరంతో మొదలయ్యే టైటిల్స్‌నే ఎంపిక చేసుకుంటూ వచ్చాడు త్రివిక్రమ్.

అజ్ఞాతవాసి, అ ఆ, అరవింద సమేత... ఈ కోవలోకే వస్తాయి. ఇందులో అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ అయినా... మిగతా మూడు సినిమాలు మాత్రం సూపర్ హిట్ అనిపించుకున్నాయి. దీంతో ఆయన తీయబోయే కొత్త సినిమా టైటిల్ కూడా అ అనే అక్షరంతోనే మొదలవుతుందని చాలామంది భావించారు. అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం త్రివిక్రమ్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ... త్రివిక్రమ్ కచ్చితంగా మళ్లీ తన సక్సెస్ సెంటిమెంట్‌ను ఫాలో అవుతారని ఇండస్ట్రీ వర్గాలు గట్టిగా నమ్మాయి.

అయితే మాటల మాంత్రికుడు మాత్రం ఈ సారి తన సెంటిమెంట్ ‘అ’ను పక్కనపెట్టినట్టు గుసగుసలు జోరందుకున్నాయి. ఈ కొత్త సినిమాను నాన్న నేను అనే టైటిల్ దాదాపుగా ఖరారైందని... ఇందుకు త్రివిక్రమ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్ సర్కిల్స్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. కథకు తగ్గట్టుగా ఉండటం వల్లే ఈ టైటిల్‌కు మాటల మాంత్రికుడు ఓకే చేశారని అంటున్నారు. మరి నిజంగానే త్రివిక్రమ్ తన సెంటిమెంట్‌ను వదలుకున్నాడా లేక అటు తిరిగి ఇటు తిరిగి అ అక్షరంతో మొదలయ్యే టైటిల్‌నే ఫైనల్ చేస్తాడా అన్నది చూడాలి.



First published: July 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...