అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కూడా పూర్తి చేసాడు ఈయన. బన్నీ కూడా చాలా ఉత్సాహంగా షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ చిత్రం పూర్తిగా ఫాదర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కనుంది. గతంలో సన్నాఫ్ సత్యమూర్తి కూడా ఇదే కథతో వచ్చింది. ఇప్పుడు మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇదే చేయబోతున్నాడు. ఈ సినిమాకు నాన్న నేను అనే ఆసక్తికరమైన టైటిల్ పరిశీలిస్తున్నారు. ఒకరి కోసం ఒకరు అనేది ట్యాగ్ లైన్.

అల్లు అర్జున్ టబు
ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ కూడా వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూట్ హైదరాబాద్లోనే జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో అల్లు అర్జున్ అమ్మగా టబు నటిస్తుంది. తాజాగా ఈమె సెట్లోకి అడుగు పెట్టింది. దాంతో టబు మేకింగ్ వీడియో విడుదల చేసింది చిత్రయూనిట్. వెల్ కమ్ టూ అబోర్డ్ టబు గారూ స్వాగతం పలికారు త్రివిక్రమ్ అండ్ గ్యాంగ్. కూలీ నెం 1 సినిమాతో పరిచయం అయిన టబు.. ఆ తర్వాత ఆవిడా మా ఆవిడే, నిన్నే పెళ్లాడతా, చెన్నకేశవరెడ్డి., అందరివాడు లాంటి 15 సినిమాల్లో నటించింది. చివరగా బాలయ్యతో పాండురంగడు సినిమాలో నటించిన తర్వాత ఇప్పటి వరకు తెలుగు తెరపై కనిపించలేదు ఈ బ్యూటీ.
ఇక ఇప్పుడు బన్నీ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుంది టబు. సీనియర్ హీరోయిన్లకు తన సినిమాలలో వరస అవకాశాలు ఇచ్చే త్రివిక్రమ్ ఈ సారి ఆ ఛాన్స్ టబుకు ఇస్తున్నాడు. ఇప్పటికే ఈయన నదియా, ఖుష్బూ, స్నేహ లాంటి వాళ్లను తన సినిమాలతో ఫేమస్ చేసాడు. ఇప్పుడు టబు కూడా వస్తుంది. ముందు నగ్మా ఈ సినిమాలో నటిస్తుందనే వార్తలు వినిపించినా ఇప్పుడు టబుకు ఈ ఆఫర్ వచ్చింది. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సంక్రాంతికి సినిమా విడుదల కానుంది. మరి టబు రీ ఎంట్రీ ఎలా ఉండబోతుందో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published:July 24, 2019, 10:56 IST