రైటర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి దర్శకుడిగా మారి, మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇప్పుడు ఈయనతో సినిమా చేయడానికి అగ్ర హీరోలు ఎదురుచూస్తుంటారు. త్రివిక్రమ్ సినిమాలను గమనిస్తే.. సన్నివేశాలనైనా, కథను అయినా వేరే సినిమాల నుండి తీసుకున్నప్పటికీ తనదైన శైళిలో బలమైన మాటలు, సన్నివేశాలను మార్చి సినిమాకు కొత్త రూపును తీసుకొస్తుంటాడు. ఇప్పుడు ఇలాంటి ప్రయోగాన్ని త్రివిక్రమ్ చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
సినీ వర్గాల సమాచారం మేరకు త్రివిక్రమ్.. ఇతిహాసం మహాభారతంపై ఫోకస్ పెట్టాడట. ఇప్పటికే అల్లు అరవింద్ చేయబోతున్న త్రీడీ రామాయణం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరో ఇతిహాసంపై త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫోకస్ పెట్టాడంటున్నారు. అయితే మహాభారతంను పౌరాణికంగా కాకుండా సోషలైజ్ చేసి సినిమా రూపంలో తెరకెక్కించడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. అంటే మహాభారతంలోని పాత్రలకు సామాజిక పాత్రలుగా కనిపిస్తాయని అంటున్నారు.
ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ హీరోగా సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే సినిమా లాంఛనంగా ప్రారంభమవుతుందని కూడా టాక్ వినిపిస్తోంది. అరవింద సమేత వీర రాఘవ తర్వాత ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ చేస్తున్న సినిమా ఇది. రాధాకృష్ణ, కల్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.