రాజమౌళి కూడా ఆ విషయంలో త్రివిక్రమ్ తర్వాతే..

తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ దర్శకుడు రాజమౌళి. ఈ విషయం ఆరేళ్ల పిల్లాడిని అడిగినా కూడా తడుముకోకుండా చెప్తాడు. ఎందుకంటే ఆయన సినిమాలే సమాధానం మరి. బాహుబలితో రాజమౌళి రేంజ్ ఏంటనేది..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 21, 2020, 9:00 PM IST
రాజమౌళి కూడా ఆ విషయంలో త్రివిక్రమ్ తర్వాతే..
త్రివిక్రమ్ రాజమౌళి ఫైల్ ఫోటోస్
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ దర్శకుడు రాజమౌళి. ఈ విషయం ఆరేళ్ల పిల్లాడిని అడిగినా కూడా తడుముకోకుండా చెప్తాడు. ఎందుకంటే ఆయన సినిమాలే సమాధానం మరి. బాహుబలితో రాజమౌళి రేంజ్ ఏంటనేది అందరికీ తెలిసిపోయింది. ఇలాంటి దర్శకుడికి సాధ్యం కాని రికార్డులు అంటూ ఉంటాయా.. ప్రస్తుతం టాలీవుడ్ రికార్డులన్నీ ఈయన సినిమాల పేరు మీదే ఉన్నాయి. అన్నింటికి ఒకే సమాధానం బాహుబలి. అందుకే రాజమౌళి కూడా దర్శక బాహుబలి అయ్యాడు. అయితే ఇన్ని రికార్డులు సాధించిన రాజమౌళి.. ఒక్క విషయంలో మాత్రం త్రివిక్రమ్ కంటే వెనకాల ఉన్నాడు.
Trivikram Srinivas beaten SS Rajamouli and created one more record with Ala Vaikuntapurramuloo pk తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ దర్శకుడు రాజమౌళి. ఈ విషయం ఆరేళ్ల పిల్లాడిని అడిగినా కూడా తడుముకోకుండా చెప్తాడు. ఎందుకంటే ఆయన సినిమాలే సమాధానం మరి. బాహుబలితో రాజమౌళి రేంజ్ ఏంటనేది.. trivikram,trivikram twitter,trivikram instagram,trivikram ala vaikuntapurramuloo,trivikram ss rajamouli,trivikram rajamouli,trivikram ala vaikuntapurramuloo,telugu cinema,అల వైకుంఠపురములో,త్రివిక్రమ్ రాజమౌళి,త్రివిక్రమ్ ఓవర్సీస్,తెలుగు సినిమా
త్రివిక్రమ్ రాజమౌళి ఫైల్ ఫోటోస్

మాటల మాంత్రికుడి ధాటికి దర్శకధీరుడు కూడా కాస్త సైడ్ ఇచ్చాడు. అదే ఓవర్సీస్ కలెక్షన్స్ విషయంలో. తొలి రెండు స్థానాల్లో బాహుబలి 2, బిగినింగ్ ఉన్నాయి. కానీ మూడో స్థానంపై ఇప్పుడు కన్నేసాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అయితే ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. నాలుగు సార్లు ఓవర్సీస్‌లో 2 మిలియన్ క్లబ్ అంతకంటే ఎక్కువ అందుకున్న దర్శకుడు త్రివిక్రమ్ ఒక్కడే. రాజమౌళి ఈ విషయంలో రెండుసార్లు మాత్రమే ఉన్నాడు. తాజాగా అల వైకుంఠపురములో సినిమాతో నాలుగో సారి 2 మిలియన్ క్లబ్బులో చేరిపోయాడు మాటల మాంత్రికుడు.

Trivikram Srinivas beaten SS Rajamouli and created one more record with Ala Vaikuntapurramuloo pk తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ దర్శకుడు రాజమౌళి. ఈ విషయం ఆరేళ్ల పిల్లాడిని అడిగినా కూడా తడుముకోకుండా చెప్తాడు. ఎందుకంటే ఆయన సినిమాలే సమాధానం మరి. బాహుబలితో రాజమౌళి రేంజ్ ఏంటనేది.. trivikram,trivikram twitter,trivikram instagram,trivikram ala vaikuntapurramuloo,trivikram ss rajamouli,trivikram rajamouli,trivikram ala vaikuntapurramuloo,telugu cinema,అల వైకుంఠపురములో,త్రివిక్రమ్ రాజమౌళి,త్రివిక్రమ్ ఓవర్సీస్,తెలుగు సినిమా
త్రివిక్రమ్ రాజమౌళి ఫైల్ ఫోటోస్

దీనికంటే ముందు అజ్ఞాతవాసి, అరవింద సమేత, అ.. ఆ సినిమాలతో మూడుసార్లు 2 మిలియన్ క్లబ్బులో చోటు సంపాదించాడు త్రివిక్రమ్. ఈయనతో పోటీ పడే దర్శకులు ఈ విషయంలో మరెవరూ లేరు. అనిల్ రావిపూడి ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో రెండుసార్లు 2 మిలియన్ మార్క్ దాటేసాడు. సుకుమార్ నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాతో రెండుసార్లు.. రాజమౌళి రెండుసార్లు ఈ రికార్డ్ అందుకున్నారు. అందులో త్రివిక్రమ్ మాత్రం ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.

First published: January 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు