హోమ్ /వార్తలు /సినిమా /

నితిన్‌ ఆ గురు శిష్యులకు బాగా రుణపడిపోయాడుగా..

నితిన్‌ ఆ గురు శిష్యులకు బాగా రుణపడిపోయాడుగా..

2. భీష్మ: కథ నచ్చినా కుదర్లేదు..

2. భీష్మ: కథ నచ్చినా కుదర్లేదు..

Bheeshma Collections: నాలుగేళ్ల కింద వచ్చిన అ..ఆ సినిమా తర్వాత నితిన్ ఒక్క హిట్ కూడా కొట్టలేదు. లై, చల్ మోహన్ రంగా, శ్రీనివాస కళ్యాణం లాంటి సినిమాలు అంచనాలు అందుకోలేదు. అప్పుడు త్రివిక్రమ్.. ఇప్పుడు వెంకీ కుడుముల హిట్ ఇచ్చారు.

భీష్మ సినిమా కలెక్షన్లు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది ఇప్పుడు. కష్టాల్లో ఉన్నపుడు సాయం చేసిన వాళ్లను ఎప్పుడూ మరిచిపోకూడదు. ఇప్పుడు నితిన్ విషయంలో కూడా గురు శిష్యులు ఇదే చేసారు. ఈయన కెరీర్ గాడితప్పిన సమయంలో వచ్చి రెండు భారీ విజయాలు అందించారు. నాలుగేళ్ల కింద వచ్చిన అ..ఆ సినిమా తర్వాత నితిన్ ఒక్క హిట్ కూడా కొట్టలేదు. లై, చల్ మోహన్ రంగా, శ్రీనివాస కళ్యాణం లాంటి సినిమాలు అంచనాలు అందుకోలేదు. త్రివిక్రమ్ తర్వాత మరే దర్శకుడు కూడా ఈయనకు హిట్ అందించలేకపోయాడు. దాంతో ఏడాదిన్నర గ్యాప్ బాగానే పనికొచ్చింది ఈయనకు. మొన్న అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా కోసం ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్నాడు.. బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు నితిన్ కూడా ఇదే చేసాడు.

నితిన్ త్రివిక్రమ్ వెంకీ కుడుముల (nithiin trivikram)
నితిన్ త్రివిక్రమ్ వెంకీ కుడుముల (nithiin trivikram)

ఈయన కూడా భారీ గ్యాప్ తీసుకుని భీష్మ సినిమాతో వచ్చాడు. ఈ చిత్రం కూడా మంచి విజయం దిశగా అడుగేస్తుంది. తొలిరోజే ఈ చిత్రం 7.5 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. అప్పుడు త్రివిక్రమ్ వచ్చి నితిన్ కెరీర్‌కు బ్రేక్ ఇస్తే.. ఇప్పుడు ఆయన శిష్యుడు వెంకీ కుడుముల వచ్చి మరో హిట్ ఇచ్చాడు. అ..ఆ సినిమాకు ముందు వరస ఫ్లాపులతో నితిన్ కెరీర్ దారుణంగా ఉంది. ఇప్పుడు కూడా హ్యాట్రిక్ ఫ్లాపులతో ఉన్నాడు నితిన్. ఏదేమైనా అత్తారింటికి దారేదిలో నా కోసమే కాదు.. నా కుటుంబం కోసం వచ్చాడు అతను అన్నట్లు నితిన్‌కు హిట్ ఇవ్వడానికే వచ్చారు ఈ గురు శిష్యులు. ఫుల్ రన్‌లో కచ్చితంగా 30 కోట్లకు పైగానే షేర్ వసూలు చేసేలా కనిపిస్తుంది భీష్మ. రష్మిక మందన్న ఈ చిత్రంతో మరో హిట్ కొట్టింది.

First published:

Tags: Bheeshma, Nithiin, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు