అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో సినిమా షూటింగ్ వేగంగానే జరుగుతుంది. ఈ చిత్ర షూటింగ్ అనుకున్న దానికంటే వేగంగానే వెళ్తుంది. 2020 సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. దీనిపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. తండ్రి సెంటిమెంట్ ఈ చిత్రంలో హైలైట్ కానుందని తెలుస్తుంది. తనకు బలంగా ఉన్న ఎమోషన్స్ ఈ సినిమాలో కూడా చూపించబోతున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమా టీజర్‌ను త్రివిక్రమ్ పుట్టినరోజున విడుదల చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు మాత్రం ప్లాన్ మారిపోయింది.
టీజర్ త్రివిక్రమ్ బర్త్ డే రోజు కాకుండా దసరా రోజు విడుదల కానుందని తెలుస్తుంది. టీజర్ విడుదల చేయడానికి దసరాకు మించిన సమయం మరోటి లేదని ప్రచారం జరుగుతుంది. దానికితోడు సైరాను విడుదల చేస్తున్న థియేటర్స్‌లో కూడా అల వైకుంఠపురములో టీజర్ విడుదల కానుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అలా చేస్తే సినిమాకు మరింత హైప్ వస్తుందని ప్రచారం జరుగుతుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌కు సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ala Vaikunthapuramulo, Allu Arjun, Dussehra 2019, Telugu Cinema, Tollywood, Trivikram