Trivikram Preparing Script For Ramayanam: పౌరాణిక చిత్రానికి స్క్రిప్ట్ రెడీ చేస్తున్న త్రివిక్ర‌మ్‌

Trivikram Preparing Script For Ramayanam: పౌరాణిక చిత్రానికి స్క్రిప్ట్ రెడీ చేస్తున్న త్రివిక్ర‌మ్‌

trivikram script for ramayanam

Trivikram - Ramayanam: అల్లు అర‌వింద్... మ‌ధు మంతెన‌, న‌మిత్ మ‌ల్హోత్రాల‌తో క‌లిసి రామాయ‌ణంను త్రీడీ టెక్నాల‌జీతో ప్యాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు గ‌త ఏడాదిన ప్ర‌క‌టించారు. దీనికి త్రివిక్ర‌మ్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నార‌ని స‌మాచారం.

  • Share this:
    మన‌కు సంబంధించి పౌరాణిక చిత్రాలంటే ఎక్కువ‌గా రామాయ‌ణం, మ‌హాభార‌తాలే.. ఎన్నిసార్లు ఈ పౌరాణికాల‌ను సినిమాలుగా తీస్తే అన్నింటినీ ప్రేక్ష‌కులు ఆద‌రించారు. ముఖ్యంగా ఎన్టీఆర్‌, ఎ.ఎన్‌.ఆర్ , శోభ‌న్‌బాబు వంటి తార‌లు పౌరాణిక పాత్ర‌ల్లో న‌టించిన‌వారే. నేటి త‌రం అగ్ర క‌థానాయ‌కుల్లో బాల‌కృష్ణ మాత్ర‌మే పౌరాణిక పాత్ర‌ల్లో న‌టించారు. క్ర‌మంగా.. పౌరాణిక చిత్రాలు తెర‌కెక్కించ‌డం త‌గ్గిపోయాయి. ఓ ద‌శ‌లో పౌరాణిక చిత్రాల గురించి ఆలోచించ‌డ‌మే మానేశారు. ఇప్పుడు మ‌ళ్లీ ట్రెండ్ మారుతోంది. మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు మ‌ళ్లీ పౌరాణిక చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. మ‌ల‌యాళంలో మ‌హాభార‌తాన్ని ఇరండామూలం అనే పేరు తెర‌కెక్కిస్తార‌ని అనౌన్స్ చేశారు. త‌ర్వాత విక్ర‌మ్ క‌ర్ణ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. అర‌వింద్ మ‌రికొంత నిర్మాత‌ల‌తో క‌లిసి రామాయ‌ణాన్ని త్రీడీ టెక్నాల‌జీతో రూపొందించ‌నున్న‌ట్లు తెలిపారు. ఇక మ‌హాభార‌తాన్ని తెర‌కెక్కించ‌డ‌మే త‌న ల‌క్ష్యమ‌ని రాజ‌మౌళి తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే.

    అల్లు అర‌వింద్... మ‌ధు మంతెన‌, న‌మిత్ మ‌ల్హోత్రాల‌తో క‌లిసి రామాయ‌ణంను త్రీడీ టెక్నాల‌జీతో ప్యాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు గ‌త ఏడాదిన ప్ర‌క‌టించారు. దంగ‌ల్ ద‌ర్శ‌కుడు నితిశ్ తివారి, మామ్ ద‌ర్శ‌కుడు ర‌వి ఉద్యావ‌ర్ కాంబినేష‌న్‌లో ఐదు వంద‌ల కోట్ల రూపాయ‌ల భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తామ‌ని తెలిపారు. 2020 ప్ర‌థ‌మార్థంలో ప్రారంభించి 2021లో సినిమాను విడుద‌ల చేస్తామ‌ని అప్ప‌ట్లో నిర్మాత‌లు తెలిపారు. అయితే కొన్ని రోజులు త‌ర్వాత ఈ సినిమా ఆగిపోయిన‌ట్లు వార్త‌లు వినిపించాయి.

    కానీ తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమా ఆగిపోలేద‌ట‌. టాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుల్లో ఒక‌డైన త్రివిక్ర‌మ్ ప్ర‌స్తుతం ఈ సినిమాకు స్క్రిప్ట్ వ‌ర్క్‌ను అందిస్తున్నాడ‌ట‌. రామాయ‌ణం మొత్తాన్ని మూడు గంట‌ల్లో కుదించి త్రివిక్ర‌మ్ మాట‌లు రాస్తున్నాడ‌ని స‌మాచారం. తెలుగులో స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్త‌యిన త‌ర్వాతే మిగిలిన భాష‌ల‌కు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ జరుగుతుంద‌ని అంటున్నారు. తార‌క్ సినిమా స్టార్ట్ అయ్యే వ‌ర‌కు త్రివిక్ర‌మ్ ఈ స్క్రిప్ట్ వ‌ర్క్ మీద‌నే కూర్చుంటాడ‌ని టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే రామాయ‌ణంను ఆదిపురుష్ పేరుతో ఓంరావుత్ తెర‌కెక్కిస్తుండ‌గా, ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్నాడు. మ‌రి అర‌వింద్ నిర్మించ‌బోయే ఈ త్రీడీ రామాయ‌ణంలో రాముడిగా ఎవ‌రు న‌టిస్తార‌నేది కూడా ఆస‌క్తిని క‌లిగించే అంశ‌మే.
    Published by:Anil
    First published:

    అగ్ర కథనాలు