• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • TRIVIKRAM NITHIIN SAMANTHA AKKINENI BLOCKBUSTER MOVIE A AA COMPLETED 5 YEARS AND ITS FINAL COLLECTIONS PK

A Aa movie @ 5 Years: త్రివిక్రమ్ సెల్యూలాయిడ్.. నితిన్, సమంత ‘అ ఆ’ సినిమాకు ఐదేళ్ళు..

అ ఆ సినిమాకు ఐదేళ్ళు (A Aa movie)

A Aa movie @ 5 Years: అప్పటి వరకు కేవలం స్టార్ హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తూ వస్తున్న త్రివిక్రమ్(Trivikram Srinivas).. ఒక్కసారిగా పంథా మార్చుకుని చేసిన సినిమా అ ఆ(A Aa). హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ చిత్రం 2016 జూన్ 2న విడుదలైంది.

  • Share this:
అప్పటి వరకు కేవలం స్టార్ హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తూ వస్తున్న త్రివిక్రమ్.. ఒక్కసారిగా పంథా మార్చుకుని చేసిన సినిమా అ ఆ. నితిన్ లాంటి హీరోతో ఈయన సినిమా అనౌన్స్ చేసినపుడు అంతా షాక్ అయ్యారు. పవన్, బన్నీ, మహేష్ లాంటి హీరోలతోనే అప్పటి వరకు సినిమాలు చేసిన ఈయన.. సమంత మెయిన్ లీడ్‌గా నితిన్‌ ప్రధాన పాత్రలో అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి కథ రాసుకున్నాడు. ఇందులో నితిన్ హీరోగా అనిపిస్తాడు కానీ సమంత కోణంలోనే కథ సాగుతుంది. ఓ రకంగా చెప్పాలంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఏ మాత్రం తక్కువ కాకుండా ఉంటుంది అ.. ఆ. ఈ సినిమా విడుదలై అప్పుడే ఐదేళ్ళు గడిచిపోయింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ చిత్రం 2016 జూన్ 2న విడుదలైంది. ‘అ..ఆ’ విడుదలై 5 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా ఈ సినిమా సాధించిన వసూళ్ళ గురించి ఒక్కసారి చూద్దాం..

నైజాం- 13.19 కోట్లు
సీడెడ్- 4.18 కోట్లు
ఉత్తరాంధ్ర- 4.22 కోట్లు
ఈస్ట్- 2.39 కోట్లు
వెస్ట్- 1.98 కోట్లు
గుంటూరు- 2.50 కోట్లు
కృష్ణా- 2.20 కోట్లు
నెల్లూరు- 0.98 కోట్లు

ఏపీ + తెలంగాణ- 31.64 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- 5.15 కోట్లు

ఓవర్సీస్- 10.65 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్- 47.44 కోట్లు

[caption id="attachment_896590" align="alignnone" width="750"]a aa movie,nithiin a aa movie,nithiin trivikram a aa movie 5 years completed,a aa movie collections,trivikram a aa movie collections,telugu cinema,అ..ఆ సినిమాకు ఐదేళ్ళు,అ ఆ సినిమా కలెక్షన్స్,నితిన్ సమంత త్రివిక్రమ్ అ ఆ సినిమాకు ఐదేళ్ళు పూర్తి అ ఆ సినిమాకు ఐదేళ్ళు (A Aa movie)[/caption]

త్రివిక్రమ్ సినిమాలకు ఓవర్సీస్‌లో ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే ట్రెండ్ కొనసాగిస్తూ ఐదేళ్ళ కిందే అ..ఆ సినిమా అక్కడ 2 మిలియన్ మార్క్ క్రాస్ చేసింది. ఈ సినిమాను అప్పట్లో 27.71 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేస్తే.. 47.44 కోట్ల షేర్ వసూలు చేసింది. బయ్యర్లకు దాదాపు 20 కోట్ల లాభాలు తీసుకొచ్చింది అ..ఆ సినిమా. ఇప్పటికీ నితిన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ ఇదే.
Published by:Praveen Kumar Vadla
First published: