ఎన్టీఆర్‌కు హ్యాండ్ ఇచ్చిన దర్శకుడు.. లైన్‌లోకి వచ్చిన సీనియర్ హీరో..

NTR Venkatesh Trivirkram | స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ఎన్టీఆర్‌తో చేస్తున్నట్టు ప్రకటించాడు. అంతా బాగుంటే.. వచ్చే జూలైలో ఈ సినిమా మొదలుపెట్టి.. మళ్లీ వచ్చే సమ్మర్ నాటికి విడుదల చేయాలనకున్నారు. తాజాగా త్రివిక్రమ్ తన నెక్ట్స్ మూవీని ఎన్టీఆర్‌తో కాకుండా ఓ సీనియర్ హీరోతో చేసిన తర్వాత ఎన్టీఆర్‌ సినిమాను పట్టాలెక్కించే అవకాశాలున్నాయి.

news18-telugu
Updated: May 7, 2020, 6:50 AM IST
ఎన్టీఆర్‌కు హ్యాండ్ ఇచ్చిన దర్శకుడు.. లైన్‌లోకి వచ్చిన సీనియర్ హీరో..
అందుకే చాలా జాగ్రత్తగా ప్యాన్ ఇండియన్ కథలను.. అలాంటి దర్శకులను ఎంచుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక ప్రశాంత్ నీల్ సినిమా కోసం కూడా ఏకంగా రెండేళ్లకు పైగా డేట్స్ ఇస్తున్నాడని ప్రచారం జరుగుతుంది.
  • Share this:
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ఎన్టీఆర్‌తో చేస్తున్నట్టు ప్రకటించాడు. అంతా బాగుంటే.. వచ్చే జూలైలో ఈ సినిమా మొదలుపెట్టి.. మళ్లీ వచ్చే సమ్మర్ నాటికి విడుదల చేయాలనకున్నారు. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ పేరుతో ఓ సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా స్కిప్ట్ వర్క్ జరుగుతోంది. కాగా గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో ‘అరవింద సమేత వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ తాజా సినిమా కొంత పొలిటికల్ టచ్ ఉండనుందని టాక్. అంతేకాదు ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ చిత్రా హారికా హాసిని క్రియేషన్స్‌  చినబాబుతో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో కళ్యా ణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ అగ్ర హీరో సంజయ్ దత్ విలన్‌గా యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్, శృతి హాసన్‌ను హీరోయిన్స్‌గా అనుకుంటున్నారు. కానీ కరోనా కారణంగా ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశం లేదు.

jr ntr trivikram upcoming movie ayinanu poyiravale hastinaku fan made poster go viral on social media,ntr trivikram,#NTR,ntr trivikram political backdrop movie,Jr ntr balakrishna trivikram,jr ntr rashmika pooja hegde trivikram,ntr,jr ntr,rrr,rrr jr ntr,trivikram, ayinanu poyiraavale hasthinaku,ntr trivikram title ayinanu poyiraavale hasthinaku,ayinanu poyiravale hasthinaku,ntr trivikram ayinanu poyiravale hasthinaku,ala vaikunthapurramloo,Trivikarm to work with NTR for his next movie,jr ntr,jr ntr new movie,jr ntr movies,jr ntr upcoming movie,trivikram,trivikram movies,jr ntr new look for his next movie revealed,ntr movies,jr ntr and trivikram srinivas new movie,jr ntr and trivikram srinivas new movie confirm,trivikram srinivas with jr ntr,jr ntr trivikram srinivas movie,anirudh music for trivikram and jr ntr next movie,jr ntr hard work for his new makeover,త్రివిక్రమ్,ఎన్టీఆర్,అరవింద సమేత వీరరాఘవ,అయినను పోయిరావలె హస్తినకు,అయినను పోయిరావలె హస్తినకు ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ టైటిల్,రాజకీయ నేపథ్యంలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా,పూజా హెగ్డే,రష్మిక మందన్న,
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎన్టీఆర్, త్రివిక్రమ్ లేెటెస్ట్ మూవీ పోస్టర్ (Twitter/Photo)


ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాలంటే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కంప్లీట్ కావాలి. కానీ ప్రస్తుతం కరోనా కారణంగా అన్ని సినిమాలకు సంబంధించిన షూటింగ్స్‌తో పాటు ఆర్ఆర్ఆర్ షూటింగ్ వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ఒకసారి వాయిదా పడింది. ఈ యేడాది జూలై 31 నుంచి 2021 జనవరి 8కి వాయిదా పడింది. ఈ డేట్‌కు ఈ సినిమా వస్తుందో రాదో కూడా ఇప్పట్లో చెప్పడం కష్టం. ఇక ఆర్ఆర్ఆర్ వచ్చే యేడాది సమ్మర్‌కు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Trivikram next movie with not with jr ntr and his direct balakrishna rana multistarer,jr NTR,NTR,Balakrishna,Balakrishna trivikram,jr ntr rrr,jr ntr trivikram,jr ntr balakrishna nandamuri trivikram,balakrishna trivikram rana Ayyappanum Koshiyum remake,jr ntr trivikram,trivikram balayya nbk balakrishna rana Ayyappanum Koshiyum remake,Balakrishna,rana daggubati,balakrishna rana daggubati,ayyappanum koshiyum telugu remake,ayyappanum koshiyum movie,ayyappanum koshiyum,balakrishna,balakrishna jr ntr trivikram movie,balakrishna father to jr ntr trivikram movie,balakrishna moviesబాలకృష్ణ,బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్,తెలుగు సినిమా,త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాలో బాలయ్య,బాలకృష్ణ త్రివిక్రమ్,త్రివిక్రమ్, బాలకృష్ణ,త్రివిక్రమ్ ఎన్టీఆర్,త్రివిక్రమ్ బాలయ్య రానా బాలకృష్ణ అయ్యప్పనుమ్ కోసియుమ్ రీమేక్,మలయాళ రీమేక్‌ను డైరెక్ట్ చేయనున్న త్రివిక్రమ్
ఎన్టీఆర్, త్రివిక్రమ్.. Photo : Twitter


ఇప్పటికే త్రివిక్రమ్.. ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ను పూర్తి చేసి తారక్‌కు మొత్తం నేరేట్ చేసేసాడు. ఐతే లాక్‌డౌన్ తర్వాత వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఇప్పటికే చాల ా పెండింగ్‌లో ఉంది. ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు ఎన్టీఆర్ తన లుక్‌ను కంటిన్యూ చేయవలసి ఉంటుంది. ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ పార్ట్ ఎప్పటికీ కంప్లీట్ అవుతుందో తెలియదు.ఒకవేళ రషెస్ చూసుకున్నాకా.. ఏదైనా తేడా కొడితే.. మళ్లీ  రీ షూట్‌కు వెళ్లాలి.  ఎంత లేదన్నా దీనికి మరింత సమయంల పడుతుంది. ఈ లోపల త్రివిక్రమ్.. వెంకటేష్‌తో సినిమా కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట.

వెంకటేష్, త్రివిక్రమ్ మూవీ (Twitter/Photo)


ఇప్పటికే వీరిద్దరి కలయికలో ఓ సినిమా అనౌన్స్ అయిన ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు.అప్పట్లో వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన విడుదల చేయడమే కాదు.. ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు ముందుకు కదలలేదు.  తాజాగా త్రివిక్రమ్.. ముందుగా వెంకటేష్‌తో అనుకున్న సినిమాను కంప్లీట్ చేసేందుకు ఆ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం వెంకటేష్ నారప్ప సినిమా  చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఓ 20 రోజులు చేస్తే కంప్లీట్ అయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అన్ని సినిమాల్లాగే ఈ చిత్ర షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది. ముందుగా త్రివిక్రమ్.. ఎన్టీఆర్‌తో కుదరకపోతే.. నాగ చైతన్య, నానిలతో సినిమా చేయాలనకున్నాడు. కానీ వెంకటేష్ లైన్‌లో వచ్చి గతంలో తనతో సినిమా చేస్తానని చెప్పిన కథను రెడీ చేయమని చెప్పాడట. దీంతో త్రివిక్రమ్.. ముందుగా వెంకటేష్‌ సినిమాకు సంబంధించిన పనులను మొదలుపెట్టాడు. మొత్తానికి ఎన్టీఆర్‌తో సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉండటంతో ఇపుడు త్రివిక్రమ్.. వెంకటేష్‌ను లైన్లో పెట్టాడు.
Published by: Kiran Kumar Thanjavur
First published: May 7, 2020, 6:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading