ఈ యేడాది త్రివిక్రమ్.. అల్లు అర్జున్ హీరోగా ‘అల వైకుంఠపురములో’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తెలుగులో మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్, ఎన్టీఆర్ హీరోగా నెక్ట్స్ మూవీ ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ పేరుతో ఓ సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా స్కిప్ట్ వర్క్ జరుగుతోంది. కాగా గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో ‘అరవింద సమేత వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ తాజా సినిమా కొంత పొలిటికల్ టచ్ ఉండనుందని టాక్. అంతేకాదు ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ చిత్రా హారికా హాసిని క్రియేషన్స్ చినబాబుతో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యా ణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ అగ్ర హీరో సంజయ్ దత్ విలన్‌గా యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్, శృతి హాసన్‌ను హీరోయిన్స్‌గా అనుకుంటున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎన్టీఆర్, త్రివిక్రమ్ లేెటెస్ట్ మూవీ పోస్టర్ (Twitter/Photo)
ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాలంటే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కంప్లీట్ కావాలి. కానీ ప్రస్తుతం కరోనా కారణంగా అన్ని సినిమాలకు సంబంధించిన షూటింగ్స్‌తో పాటు ఆర్ఆర్ఆర్ షూటింగ్ వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ఒకసారి వాయిదా పడింది. ఈ యేడాది జూలై 31 నుంచి 2021 జనవరి 8కి వాయిదా పడింది. ఈ డేట్‌కు ఈ సినిమా వస్తుందో రాదో కూడా ఇప్పట్లో చెప్పడం కష్టం.

ఎన్టీఆర్, త్రివిక్రమ్.. Photo : Twitter
ఇప్పటికే త్రివిక్రమ్.. ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ను పూర్తి చేసి తారక్‌కు మొత్తం నేరేట్ చేసేసాడు. ఐతే లాక్డౌన్ తర్వాత వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఇప్పటికే చాల ా పెండింగ్‌లో ఉంది. ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు ఎన్టీఆర్ తన లుక్‌ను కంటిన్యూ చేయవలసి ఉంటుంది. ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ పార్ట్ ఎప్పటికీ కంప్లీట్ అవుతుందో తెలియదు.

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా (ntr trivikram new movie)
ఒకవేళ రషెస్ చూసుకున్నాకా.. ఏదైనా తేడా కొడితే.. మళ్లీ రీ షూట్‌కు వెళ్లాలి. ఎంత లేదన్నా దీనికి మరింత సమయంల పడుతుంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాను బాహుబలి రిలీజ్ చేసిన ఏప్రిల్ 28న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు రాజమౌళి. ఈ లోపున త్రివిక్రమ్ ఓ మాదిరి బడ్జెట్లో ‘అ..ఆ’ సినిమా మాదిరి ఒకటి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అందులో హీరోలుగా నాగ చైతన్య, నాని పేర్లు వినిపిస్తున్నాయి. ఎక్కువ మటుకు నాగ చైతన్యతో చేసే అవకాశాలున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఎన్టీఆర్ రావడం ఆలస్యమైతే ఈలోగా త్రివిక్రమ్ ఈ ఇద్దరి హీరోల్లో ఎవరితోనైనా మరో ప్రాజెక్ట్‌ను పూర్తి చేసే అవకాశాలను కొట్టిపారేయలేము.
Published by:Kiran Kumar Thanjavur
First published:April 29, 2020, 07:42 IST